HomeజాతీయంHead Constable Jobs Notification | ఇంటర్‌ అర్హతతో పోలీస్ హెడ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు!

Head Constable Jobs Notification | ఇంటర్‌ అర్హతతో పోలీస్ హెడ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు!

Head Constable Jobs Notification | ఢిల్లీ పోలీస్‌ సర్వీస్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదలైంది. ఈ నోటిఫికేషన్​ను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ రిలీజ్​ చేసింది.

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Head Constable Jobs Notification | ఢిల్లీ పోలీస్‌ సర్వీస్‌లో ఉద్యోగాల Jobs భర్తీ చేపడుతున్నారు. ఇక్కడ హెడ్‌ కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ notification విడుదలైంది. ఈ నోటిఫికేషన్​ను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ విడుదల చేసింది.

మొత్తం 509 హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టుల Head Constable భర్తీ చేపడుతున్నారు. మహిళ అభ్యర్ధులకు 168, పురుషులకు 341 పోస్టులు ఇందులో కేటాయించారు. ఇంటర్​ విద్యార్హత Intermediate education కలిగి అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపికైనవారు ఢిల్లీలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇంటర్​ / తత్సమాన విద్యార్హత గల వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు జులై 1, 2025 నాటికి 18 – 25 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులు.

Head Constable Jobs Notification | వయో సడలింపు..

గరిష్ఠ వయసులో ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు వయోసడలింపు ఉంటుంది. అర్హులైనవారు ఆన్‌లైన్​లో ఈ నెల (అక్టోబరు, 2025) 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

జనరల్‌ అభ్యర్ధులు రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు లేదు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఉంటుంది. పీఈటీ PET పరీక్షలు, శారీరక ప్రమాణాల ఆధారంగా ఎంపిక ఫైనల్​ చేస్తారు.

అన్ని అర్హతలు పొంది ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ.25,500 ప్రారంభ వేతనం ఉంటుంది. దీంతోపాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, అలవెన్సులతో కలిపి రూ.అర లక్ష వరకు అందుకోవచ్చు.

అర్హతలు, అనుభవం, అంతర్గత పరీక్షల ఆధారంగా ప్రమోషన్లు ఉంటాయి. ఆన్‌లైన్‌ రాత పరీక్ష డిసెంబరు(2025) / జనవరి(2026) నెలల్లో ఉండే అవకాశం ఉంది.