అక్షరటుడే, వెబ్‌డెస్క్: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో వేతనం అందుకుంటున్నా.. లంచం ఇవ్వందే ఏ పనీ చేయడు. నిత్యం రూ. వేలు, రూ. లక్షల్లో అడ్డదారిలో సంపాదన ఉండాల్సిందే. సాయం కోసం వచ్చిన సామాన్యులను పట్టిపీడిస్తాడు. నేరస్తుల నుంచి అడ్డగోలుగా డబ్బు లాగుతాడు.
ఎట్టకేలకు పాపం పండింది.. విజిలెన్స్ అధికారులకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.. అయితే తెలివి మీరిన అవినీతి పోలీసు అధికారి కదా.. తప్పించుకునేందుకు పెద్ద ఎత్తుగడే వేశాడు. లంచం తీసుకున్న సొమ్మును గాలిలో విసిరేశాడు. జనాలను ఎగదోసి సాక్ష్యం లేకుండా చేద్దామని అనుకున్నాడు. కానీ, చివరికి పట్టుబడ్డాడు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఢిల్లీలోని హౌజ్ ఖాజీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఈ ఠాణాలో విధులు నిర్వర్తించే ASI రాకేశ్ శర్మను లంచం తీసుకుంటుండగా పట్టుకోవాలని విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. బాధితుడి నుంచి అవినీతి పోలీసు అధికారి రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా.. పక్కా ప్లాన్ ప్రకారం మాటు వేసి పట్టుకున్నారు.
police officer threw money : గాల్లో నోట్లు.. అంతా గందరగోళం..
హఠాత్తుగా విజిలెన్స్ అధికారులు vigilance officers రంగ ప్రవేశం చేయడంతో.. రాకేశ్ శర్మ చురుకుగా ఆలోచించాడు. వెంటనే లంచం డబ్బు bribe money ను గాల్లోకి విసిరాడు. గాల్లో ఎగురుతూ కింద పడుతున్న రూ.500 నోట్లను అందుకునేందుకు జనాలు ఎగబడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది.
అతి కష్టం మీద విజిలెన్స్ అధికారులు రోడ్డుపై నుంచి రూ. 10 వేల నగదు సేకరించగలిగారు. అవినీతి అధికారిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ యూనిట్ డీసీపీ వివరాలు వెల్లడించారు. బాధితుడు, బజార్ నివాసి సీతారామ్ ఈ నెల (సెప్టెంబరు) 9న తమను సంప్రదించినట్లు తెలిపారు.
ఓ కేసు విషయమై లంచం కోసం వేధిస్తున్నట్లు చెప్పాడని పేర్కొన్నారు. ఈ మేరకు పక్కా ప్రణాళికతో మంగళవారం (సెప్టెంబరు 9) ఏఎస్సై రాకేశ్ శర్మ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు వివరించారు.