ePaper
More
    Homeఅంతర్జాతీయంDonald Trump | ట్రంప్ వైఖ‌రిలో స్ప‌ష్ట‌మైన మార్పు.. మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నాన‌ని వెల్ల‌డి

    Donald Trump | ట్రంప్ వైఖ‌రిలో స్ప‌ష్ట‌మైన మార్పు.. మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నాన‌ని వెల్ల‌డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump | భార‌త్ ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖ‌రి క్ర‌మంగా మారుతోంది. షాంఘై స‌హ‌కార సంస్థ (Shanghai Cooperation Organization) భేటీ త‌ర్వాత చైనా, ర‌ష్యా, భార‌త్ మ‌ధ్య బంధం మ‌రింత బ‌లోపేత‌మ‌వుతుండ‌డంతో ట్రంప్ ధోర‌ణిలో మార్పు క‌నిపిస్తోంది.

    ఈ నేప‌థ్యంలో ఆయ‌న తాజాగా చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Modi)తో మాట్లాడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి అమెరికా. భారతదేశం(India) చర్చలు తిరిగి ప్రారంభిస్తాయని తెలిపారు.

    Donald Trump | అర్థ‌వంత‌మైన ముగింపు

    50 శాతం సుంకాలు విధించ‌డంతో భార‌త్‌, అమెరికా మ‌ధ్య సంబంధాలు దారుణంగా దెబ్బ తిన్నాయి. వాణిజ్య ఒప్పందంపై ప్ర‌తిష్టంబ‌న నెల‌కొన‌డంతో ట్రంప్ ఇటీవ‌ల ప‌లుమార్లు ఫోన్ చేసినా మోదీ స్పందించ‌లేదు. ఈ నేప‌థ్యంలో అన్ని వైపులా నుంచి ఒత్తిడి పెరుగుతుండ‌డం, ఇండియా, చైనా సంబంధాలు బ‌ల‌ప‌డుతుండ‌డంతో ట్రంప్ కాస్త వెన‌క్కు త‌గ్గుతున్నారు. ఈ మేర‌కు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు “రెండు దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి చర్చలు కొనసాగిస్తున్నాయని ప్రకటించడానికి నేను సంతోషంగా ఉన్నాను. రాబోయే వారాల్లో చాలా మంచి స్నేహితుడు, ప్రధాన మంత్రి మోదీతో మాట్లాడటానికి నేను ఎదురుచూస్తున్నాను. మన రెండు గొప్ప దేశాలకు విజయవంతమైన ముగింపుకు రావడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదని నేను ఖచ్చితంగా భావిస్తున్నాన‌ని” పేర్కొన్నారు.

    Donald Trump | భార‌త్ తో ప్ర‌త్యేక సంబంధాలు.

    షాంఘై సహకార సదస్సుకు హాజరైన మోదీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్(China President Xi Jinping), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌(Russian President Vladimir Putin)లతో ద్వైపాక్షిక చ‌ర్చ‌లు జ‌రిపారు. ఆయాదేశాల‌తో మ‌రింత బ‌ల‌మైన సంబంధాలు ఏర్పాటు చేసుకోవాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో ట్రంప్ వైఖ‌రిలో ఒక్క‌సారిగా మార్పు వ‌చ్చింది. ఈ వారం ప్రారంభంలో అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్‌లో ఒక ప్రకటన చేస్తూ భారతదేశం-అమెరికా(America) సంబంధాలను చాలా ప్రత్యేకమని అభివ‌ర్ణించారు. తాను మోదీ ఎల్లప్పుడూ స్నేహితులుగా ఉంటామని, ఆందోళన చెందడానికి ఏమీ లేదని నొక్కి చెప్పారు.అదే స‌మ‌యంలో అత‌ను చేస్తున్న ప‌నుల‌పై అసంతృప్తితో ఉన్నాన‌ని తెలిపారు.

    More like this

    Vice President Elections | క్రాస్ ఓటింగ్‌పై కాంగ్రెస్ పోస్టుమార్టం.. త్వ‌ర‌లోనే స‌మావేశం నిర్వహించే అవ‌కాశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President Elections | ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో జ‌రిగిన క్రాస్ ఓటింగ్‌పై కాంగ్రెస్...

    Intermediate Education | విద్యార్థులకు తోడుగా నిలవడం అభినందనీయం

    అక్షరటుడే, ఇందూరు: Intermediate Education | స్టడీ మెటీరియల్ ఉచితంగా అందిస్తూ విద్యార్థులకు తోడుగా నిలవడం అభినందనీయమని జిల్లా...

    KTR | ఇల్లు కూల‌గొట్టుడే ఇందిర‌మ్మ రాజ్య‌మా? ప్ర‌భుత్వంపై కేటీఆర్ ధ్వ‌జం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | కాంగ్రెస్ ప్ర‌భుత్వం హామీలు అమ‌లు చేయ‌కుండా ప్ర‌జ‌ల‌ను మోస‌గించింద‌ని బీఆర్ ఎస్...