అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Panchayat elections | ఎస్సై పదవికి రాజీనామా (Sub-Inspector post resign) చేసి సర్పంచ్‌గా పోటీ చేసిన అభ్యర్థి ఓటమి పాలయ్యాడు. కేవలం పది ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఈ ఘటన సూర్యాపేట (Suryapet) జిల్లాలో చోటు చేసుకుంది.
రాష్ట్రంలో రెండో దశ పంచాయతీ ఎన్నికలు (panchayat elections) ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా.. 85.86 శాతం పోలింగ్ నమోదు అయింది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.72 శాతం, అత్యల్పంగా నిజామాబాద్ జిల్లాలో 76.71 శాతం పోలింగ్ నమోదు అయింది. సర్పంచ్‌గా గెలవాలని ఓ ఎస్సై తన పదవికి రాజీనామా చేసి బరిలో దిగారు. అయితే ఆయనను దురదృష్టం వెంటాడింది.
Panchayat elections | స్వచ్ఛంద విరమణ
కోదాడ టౌన్ ఎస్సైగా పని చేస్తున్న పులి వెంకటేశ్వర్లు ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఐదు నెలల సర్వీస్ ఉండగానే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. ఉద్యోగాన్ని వదులుకొని తన స్వగ్రామం కోదాడ మండలం గుడిబండ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాడు. ఈ ఎన్నికల్లో ఆయనకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన భార్య పద్మావతి మద్దతు తెలిపారు. అయినా కూడా గ్రామంలో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి విజయం సాధించాడు. రెబెల్ అభ్యర్థి నాగయ్య చేతిలో వెంకటేశ్వర్లు పది ఓట్ల తేడాతో ఓడిపోయారు.
Panchayat elections | కొడుకుపై తండ్రి విజయం
మెదక్ జిల్లా రామాయంపేట మండలం జాన్సీ లింగాపూర్‌లో కొడుకుపై తండ్రి గెలిచాడు. గ్రామానికి చెందిన రామకిష్టయ్య ఆయన కుమారుడు వెంకటేశ్ ఎన్నికల బరిలో నిలిచారు. ఇద్దరు హోరాహోరీగా ప్రచారం చేశారు. ఈ క్రమంలో ప్రజలు తండ్రి రామకిష్టయ్య వైపు మొగ్గు చేపారు. దీంతో ఆయన తన కుమారుడిపై 99 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.