ePaper
More
    HomeFeaturesUttar Pradesh | చిరుతతో పోరాడి మట్టి కరిపించాడు.. వీడియో వైరల్​..

    Uttar Pradesh | చిరుతతో పోరాడి మట్టి కరిపించాడు.. వీడియో వైరల్​..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Uttar Pradesh | మనం వెళ్తున్న మార్గంలో దూరంగా చిరుత(Leopard) పులి కనిపిస్తేనే భయ పడిపోతాం. అదే దగ్గరగా వస్తే.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెడతాం. కొందరైతే భయంతో అక్కడే కూలబడిపోతారు. కానీ ఓ వ్యక్తి మాత్రం చిరుతతో పోరాడాడు. తన ప్రాణాల కోసం ఎలాంటి భయం లేకుండా ఒంటరిగా చిరుత పులితో పోరాటం చేశాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)​లో చోటు చేసుకుంది.

    ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ ఖేరి గ్రామంలోని ఇటుక బట్టీలోకి చిరుత పులి చొరబడింది. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న వ్యక్తి దానికి దొరికిపోయాడు. దీంతో తప్పించుకునే మార్గం లేకపోవడంతో సదరు వ్యక్తి పులితో తలబడాలని నిర్ణయించుకున్నాడు. ఏ మాత్రం బెదురు లేకుండా పులితో తలపడి ప్రాణాలు దక్కించుకున్నాడు.

    చిరుత వచ్చిన విషయం తెలిసి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. చిరుతను తరమడానికి ఇటుకల(Bricks)తో కొట్టారు. అయినా అతడిని చిరుత వదలలేదు. దీంతో ఆ వ్యక్తి దానితో ఒంటరిగానే పోరాటం చేసి ప్రాణాలు కాపాడుకున్నాడు. చివరకు చిరుత పులి పొలాల్లోకి పారిపోయింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్​ అధికారులు (Forest Officers) పొలాల్లోకి వెళ్లిన చిరుతపులిని పట్టుకున్నారు. కాగా ఆ వ్యక్తి చిరుతతో పోరాడుతున్న వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. అతడి ధైర్యానికి నెటిజన్లు సలాం కొడుతున్నారు. రియల్​ హీరో బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

    More like this

    ACB Raid | రూ.4 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారిణి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. కార్యాలయాలకు వచ్చే వారి నుంచి అందిన...

    Sub Collector Vikas Mahato | పీహెచ్​సీ సబ్​సెంటర్​ నిర్మాణం కోసం స్థల పరిశీలన

    అక్షరటుడే, కోటగిరి: Sub Collector Vikas Mahato | పోతంగల్ (Pothangal)​ మండలంలోని హెగ్డేలి(Hegdely) గ్రామానికి మంగళవారం బోధన్​...

    Maggari Hanmandlu | బీఆర్​ఎస్​కు షాక్​.. పార్టీకి సొసైటీ ఛైర్మన్​ రాజీనామా

    అక్షరటుడే, బోధన్​: Maggari Hanmandlu | బీఆర్​ఎస్​కు షాక్​ తగిలింది. ఇటీవల పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్​...