అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indian Railways | దేశంలో రైళ్లలో రద్దీ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పండుగల సమయంలో టికెట్లు దొరకడం కష్టం. ఇక జనరల్ బోగీల్లో అయితే కాలు పెట్టడానికి కూడా చోటు ఉండదు. ఇటీవల దీపావళి సందర్భంగా ఓ రైలు నిండిపోయింది.
అయితే తన సామగ్రితో స్టేషన్‌కు చేరుకున్న ఓ వ్యక్తి అందులో ఎక్కడానికి స్థలం లేక ఇబ్బంది పడ్డాడు. వెంటనే తన సామనును రైలు (Train)లోని బాత్రూమ్లో నింపేవాడు. వాష్‌రూమ్ డోర్ పెట్టి దానిని బెడ్రూమ్ మార్చుకొని ప్రయాణం చేశాడు. తనతో పాటు తెచ్చుకున్న మంచాన్ని బయట కిటికీకి కట్టాడు. ఈ వ్యవహారాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియా (Social Media)లో పోస్ట్ చేయడంతో వైరల్ మారింది.
Indian Railways | టాయ్లెట్లో..
ఆ వీడియోలో ఓ వ్యక్తి రైలు టాయిలెట్ (Train Toilet) లోపల తన సామగ్రిపై పడుకుని ఉన్నాడు. విశాల్ అనే కంటెంట్ క్రియేటర్ ఈ వీడియోను తీశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఆరు లక్షల వ్యూస్ దాటింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరేమో ప్రయాణికుడిపై జాలి పడుతుండగా.. మరి కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైలులో స్థలం లేక వాష్‌రూమ్‌లో ప్రయాణిస్తున్నారని పలువురు కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు రైలులోని వారు వాష్‌రూమ్ వినియోగించకుండా ఇలా ఆక్రమించడం సరికాదని మండి పడుతున్నారు.
View this post on Instagram

