ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిSummer Camp | నిజామాబాద్‌లో HCA ఉచిత సమ్మర్ క్రికెట్ క్యాంప్స్.. ఎక్కడంటే..?

    Summer Camp | నిజామాబాద్‌లో HCA ఉచిత సమ్మర్ క్రికెట్ క్యాంప్స్.. ఎక్కడంటే..?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Summer Camp | నిజామాబాద్‌ nizamabadలోని క్రికెట్ ఔత్సాహికులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉచిత సమ్మర్ క్రికెట్ క్యాంప్స్ నిర్వహించనున్నారు. ఈ మేరకు హెచ్‌సీఏ సెక్రెటరీ దేవ్​రాజ్‌ ఓ ప్రకటనను విడుదల చేశారు. హైదరాబాద్ hyderabad నగరంతో పాటు రాష్ట్రంలోని 9 ఉమ్మడి జిల్లాల్లో మే 6 నుంచి జూన్ 5వరకు ఈ ఉచిత క్రికెట్ సమ్మర్ క్యాంప్‌లు summer camps నిర్వహించనున్నట్లు తెలిపారు.

    అండర్ 14, 16, 19 బాల, బాలికల కోసం ఈ సమ్మర్ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు. ఆసక్తి గలవారు మే 4(ఆదివారం)లోపు www.hycricket.org వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. జిల్లాల్లోని క్రీడాకారులు స్థానిక జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యాలయాల్లో మే 4 వరకు రిజిస్టేషన్ చేసుకోవాలి. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, కామారెడ్డిలో ఈ ఉచిత ప్రాక్టీస్ క్యాంప్‌లు జరగనున్నాయి.

    హైదరాబాద్‌లో సికింద్రాబాద్, ఫలక్‌నుమా, అంబర్‌పేట్, లాలాపేట్, చార్మినార్, బాలాపూర్, గోల్కొండ, ఏ.ఎస్. రావు నగర్, ఆర్.కె. పురం, ఎల్.బి. నగర్ ప్రాంతాల్లో ఈ శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. మిగతా జిల్లాల్లో వరంగల్, భూపాల్‌పల్లి, జనగామ, ములుగు, పరకాల, మహబూబాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, సిర్పూర్, తాండూర్, చెన్నూర్, మహబూబ్‌నగర్, గద్వాల్, జడ్చర్ల, నారాయణపేట్, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జహీరాబాద్, గజ్వేల్, ఖమ్మం, కొత్తగూడెం, గౌతంపూర్, పాల్వంచ, కరీంనగర్, గోదావరిఖని, జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడ, నల్గొండ, భువనగిరి, నకిరేకల్, సూర్యాపేట్‌లోనూ హెచ్‌సీఏ ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ క్యాంప్స్ జరుగుతాయని హెచ్‌సీఏ ప్రకటనలో పేర్కొంది.

    More like this

    Nizamabad City | గాయత్రి నగర్‌లో స్వచ్ఛభారత్

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Nizamabad City | నగరంలోని గాయత్రి నగర్ అంగన్వాడి కేంద్రంలో బుధవారం స్వచ్ఛభారత్...

    Nizamabad KFC | కేఎఫ్​సీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad KFC | రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని వేణుమాల్​లో (Venu Mall) గల...

    Stock Markets | ఐటీలో కొనసాగిన జోరు.. లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Stock Markets | భారత్‌, యూఎస్‌ల మధ్య ట్రేడ్‌ డీల్‌(Trade deal) వైపు అడుగులు...