అక్షరటుడే, హైదరాబాద్: HCA హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association – HCA) భారీ కుదుపునకు గురైంది. HCA అధ్యక్షుడిగా ఉన్న జగన్ మోహన్ రావును సస్పెండ్ చేసినట్లు హెచ్ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ (HACA Apex Council) ప్రకటించింది. ఆయనతోపాటు కార్యదర్శి దేవరాజ్, కోశాధికారి శ్రీనివాస్ రావును సైతం పదవుల నుంచి తొలగించినట్లు తెలిపింది. జులై 28, 2025న కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు కౌన్సిల్ వెల్లడించింది.
HCA | ఇంత కఠిన నిర్ణయం ఎందుకంటే..
సస్పెండ్‌కు గురైన ముగ్గురిపై అధికార బలాన్ని దుర్వినియోగం చేయడం, మోసం, నిధుల దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిపై హెచ్ఏసీఏ దర్యాప్తు చేపట్టింది. ఈ మేరకు హెచ్ఏసీఏ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు.
నైతిక విలువలు, పారదర్శకతకు తాము కట్టుబడి ఉన్నామని హెచ్ఏసీఏ కౌన్సిల్ స్పష్టం చేసింది. సంఘం న్యాయబద్ధతను కాపాడేందుకే ఈ ముగ్గురిపై కఠినంగా వ్యవహరించినట్లు హెచ్ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ HACA Apex Council వెల్లడించింది.
HCA : ఆరుగురిపై సీఐడీ కేసు..
కాగా, హెచ్‌సీఏ నిధుల గోల్మాల్, ఐపీఎల్ టికెట్ల (IPL tickets) ఇష్యూ కేసులో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు(HCA President Jaganmohan Rao), ప్రధాన కార్యదర్శి దేవరాజ్, కోశాధికారి జగన్నాథ్ శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్ కుమార్, శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్, ఆయన భార్య కవితపై గతంలోనే సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు కౌన్సిల్ వారిపై వేటు వేసింది.
కాగా, ఐపీఎల్ టికెట్ల వివాదంలో (జులై 9న) హెచ్ సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావుని సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జగన్ మోహన్ తో పాటు హెచ్‌సీఏ ప్రధాన కార్యదర్శి, కోశాధికారిని అదుపులోకి తీసుకున్నారు. ఐపీఎల్ టికెట్ల వివాదంలో విజిలెన్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఐడీ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా కౌన్సిల్ వారిపై సస్పెన్షన్ వేటు వేసింది.