ePaper
More
    HomeజాతీయంPahalgam Effect | ప‌హ‌ల్గామ్‌ ఎఫెక్ట్‌.. విమాన టికెట్ల ధ‌ర‌ల‌కు రెక్క‌లు

    Pahalgam Effect | ప‌హ‌ల్గామ్‌ ఎఫెక్ట్‌.. విమాన టికెట్ల ధ‌ర‌ల‌కు రెక్క‌లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Pahalgam Effect | జ‌మ్మూకశ్మీర్‌లో Jammu Kashmirని ప‌హ‌ల్గామ్‌లో జ‌రిగిన మార‌ణ‌హోమం త‌ర్వాత ప‌ర్యాట‌కులు కశ్మీర్ లోయ‌ Kashmir Valleyను వీడుతున్నారు. ఈక్ర‌మంలో విమాన టికెట్ల ధ‌ర‌ల‌కు రెక్క‌లొచ్చాయి. వ‌న్‌వే టికెట్ రేట్ ఏకంగా రూ.32 వేల‌కు చేరింది. 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత కశ్మీర్ నుంచి ప‌ర్యాట‌కులు స్వ‌స్థ‌లాల‌కు తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యారు. దీంతో ఫ్లైట్ టికెట్లకు తీవ్ర డిమాండ్ ఏర్ప‌డింది. ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని విమాన‌యాన సంస్థ‌లు ధ‌ర‌లు పెంచేశాయి.

    Pahalgam Effect |  వేలాది మంది తిరుగుముఖం

    ఉగ్ర‌దాడి జ‌రిగిన త‌ర్వాత పెద్ద సంఖ్య‌లో పర్యాట‌కులు కాశ్మీర్‌ను వీడుతున్నారు. బుధవారం ఒక్క‌రోజే శ్రీనగర్ Srinagar నుంచి దాదాపు 11,000 మంది తిరిగి వెళ్లిపోయారు. విమానాశ్రయ అధికారుల ప్రకారం శ్రీనగర్ ఎయిర్‌పోర్టుకు To Srinagar Airport సాధారణంగా రోజుకు 52 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సాధారణ సమయాల్లో 10,000 నుండి 12,000 మంది ప్రయాణికులు వ‌స్తుండ‌గా, ప్ర‌స్తుత పర్యాటక సీజన్‌లో 18,000 మంది వరకు వ‌స్తున్నారు. అయితే, ఉగ్ర‌దాడి జ‌రిగిన త‌ర్వాతి రోజే శ్రీనగర్ విమానాశ్రయం నుంచి 9,251 మంది ప్రయాణికులు 47 విమానాలలో బయలుదేరారు. ప్ర‌యాణికుల ర‌ద్దీ దృష్ట్యా ఎయిర్ ఇండియా, ఇండిగో, ఏఐ ఎక్స్‌ప్రెస్‌తో సహా ప్రధాన విమానయాన సంస్థలు అద‌నంగా ఏడు విమానాలను అందుబాటులోకి తెచ్చాయి.

    Pahalgam Effect | పెరిగిన చార్జీలు..

    కాశ్మీర్‌ లోయ నుంచి ప్ర‌యాణికులు తొందరపడటం వల్ల విమాన చార్జీలు ఒక్క‌సారిగా పెరిగాయి, చివరి నిమిషంలో ఢిల్లీకి వన్-వే One-way to Delhi టిక్కెట్ల రేట్లు రూ. 32,000 వరకు చేరాయి. ఈ ఆకస్మిక ధరల పెరుగుదలను అరికట్టడానికి, చిక్కుకుపోయిన ప్రయాణికులను దోపిడీ చేయకుండా చూసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. “శ్రీనగర్ Srinagar నుంచి పర్యాటకుల సురక్షితమైన ప్రయాణాన్ని నిర్ధారించడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నాము. చార్జీల పెరుగుదలను నివారించడానికి విమానయాన సంస్థలకు కఠినమైన ఆదేశాలు ఇచ్చాము. ఛార్జీలను పర్యవేక్షించడం, సహేతుకమైన స్థాయిలో ఉంచడం జరుగుతోంది” అని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు Union Civil Aviation Minister Ram Mohan Naidu తెలిపారు.

    మ‌రోవైపు, పౌర‌విమాన‌యాన డైరెక్టరేట్ జనరల్ Directorate General of Civil Aviation కూడా అన్ని వాణిజ్య విమానయాన సంస్థలకు Commercial Airlines కీల‌క ఆదేశాలు జారీ చేసింది. శ్రీనగర్ నుంచి విమాన కార్యకలాపాలను వేగవంతం చేయాలని, బుకింగ్‌లను రీషెడ్యూల్ చేయడం లేదా రద్దు చేయడం కోసం ఏవైనా జరిమానాలను మినహాయించాలని సూచించింది. ఈ క్లిష్ట సమయంలో ఊహించని పరిస్థితులు, సవాళ్లను ఎదుర్కొంటున్న పర్యాటకులకు అవసరమైన అన్ని ర‌కాల‌ సహాయం అందించాలని విమానయాన సంస్థలను కోరింది.

    More like this

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...

    Moneylaundering Case | మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. అక్ర‌మ ఖ‌నిజం త‌ర‌లింపు కేసులో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylaundering Case | క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ బుధ‌వారం...

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...