అక్షరటుడే, వెబ్‌డెస్క్: ceiling fan speed : ఎండాకాలం.. మండేకాలం.. సామాన్యులకు కాస్త ఉపశమం ఇచ్చేదంటే ఇంట్లో రూఫ్నకు వేలాడే సీలింగ్ ఫ్యానే.. కానీ, అదేంటో భగభగ మండే భానుడు ఓ వైపు విసిగిస్తుంటే.. మరోవైపు సీలింగ్ ఫ్యాన్ ఎంతకూ వేగంగా తిరగదు.. గాలి రాదు.. చాలా ఇళ్లలో ఇలాంటి పంకాలు చిర్రెత్తిస్తుంటాయి.
ceiling fan speed : కారణాలు.. పరిష్కారాలు..
ఫ్యాన్ రెక్కల మీద దుమ్ము, ధూళి పేరుకుపోతే అది వేగంగా తిరగదు. అందుకే వారానికి ఒకసారైనా పంకా రెక్కలను రెండువైపులా శుభ్రంగా తుడవాలి. మోటారు దగ్గర ఉండే బేరింగ్‌లను శుభ్రం చేయాలి. పంకా శుభ్రంగా ఉంటే గది అంతటా గాలి వ్యాపిస్తుంది.
ఫ్యాన్ వేగాన్ని కెపాసిటర్ నియంత్రిస్తుంది. మోటారుకు కావాల్సిన శక్తిని అదే అందిస్తుంది. కెపాసిటర్ సరిగా పని చేయకుంటే ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతుంది. కొన్నిసార్లు అందులో నుంచి శబ్దాలు వస్తుంటాయి. అందుకే కెపాసిటర్‌ను తరచూ పరీక్షించడం బెటర్. అవసరమైతే దాని స్థానంలో సమాన ఓల్జేజ్ ఉన్న కొత్తదాన్ని అమర్చితే మరింత మంచిది.
ఫ్యాన్ మోటారు సజావుగా తిరగడానికి బేరింగ్‌లు తోడ్పడతాయి. వీటి మధ్య రాపిడి పెరిగినప్పుడు పంకా వేగం తగ్గుతుంది. శబ్దం సైతం వస్తుంటుంది. కాబట్టి, బేరింగ్‌లకు ఎప్పటికప్పుడు లూబ్రికెంట్ ఆయిల్ చేయాలి. అవసరమైతే వాటిని మార్చుకోవాలి.
ఓల్టేజ్ తక్కువగా ఉన్నా ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతుంది. వైరింగ్‌ను పరీక్షించి, అవసరమైతే స్టెబిలైజర్ వాడటం మంచిది.
పంకా రెక్కలు సమతుల స్థితిలో లేకపోయినా, వంగిపోయినా, వాటిని సరిగా బిగించకపోయినా వేగం తగ్గుతుంది. తిరిగేటప్పుడు పంకా ఎక్కువగా ఊగుతుంది కూడా. ఓసారి వాటిని సరిచూసుకోవాలి.
గది విస్తీర్ణాన్ని అనుసరించి రెక్కల పరిమాణం, మోటారు సామర్థ్యం ఉండే ఫ్యాన్‌ను ఎంచుకోవాలి. తద్వారా గాలి అన్ని వైపులా చక్కగా వ్యాపిస్తుంది.