అక్షరటుడే, వెబ్‌డెస్క్: Thailand-Cambodia | రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయెల్–గాజా యుద్ధంతో ఇప్పటికే ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి. తాజాగా మరో యుద్ధం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కంబొడియా, థాయిలాండ్ (Cambodia,Thailand) పరస్పరం దాడులు చోటు చేసుకుంటున్నాయి. గురువారం ఉదయం కంబొడియాలోని రెండు సైనిక స్థావరాలపై థాయిలాండ్ వైమానిక దాడులు(Thailand Airstrikes) చేసింది. ఆరు విమానాలతో దాడులకు పాల్పడింది. దీంతో కంబొడియా సైతం ప్రతిదాడులు ప్రారంభించింది. దీంతో ఈ వివాదం యుద్ధానికి దారి తీస్తుందా అని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
Thailand-Cambodia | రాకెట్లతో విరుచుకుపడుతున్న కంబొడియా
థాయిలాండ్ వైమానిక దాడులు చేపట్టడంతో కంబొడియా రాకెట్ల(Cambodian Rockets)తో ఆ దేశంపై విరుచుకు పడింది. మరోవైపు సరిహద్దు వద్ద కాల్పులు కొనసాగుతున్నాయి. దీంతో రెండు దేశాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యుద్ధ విమానాలు, ల్యాండ్ మైన్స్, పేలుడు పదార్థాలతో రెండు దేశాలు దాడులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు 9 మంది మృతి చెందినట్లు సమాచారం. థాయిలాండ్‌లోని ఓ ఆస్పత్రిపై కంబొడియా రాకెట్‌తో దాడి చేసింది.
Thailand-Cambodia | పురాతన ఆలయం కోసం..
థాయిలాండ్, కంబొడియా మధ్య 1,100 సంవత్సరాల పురాతన ఆలయం ప్రీహ్ విహార్(Ancient Temple Preah Vihar) కోసం ఏళ్లుగా వివాదం సాగుతోంది. అయితే దీనిపై కంబొడియాకు హక్కులు కల్పిస్తూ 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అయినా థాయిలాండ్ వెనక్కి తగ్గలేదు. దీంతో 2011లో మరోసారి న్యాయస్థానం తన తీర్పును సమర్థించుకుంది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. తాజాగా ఇవి దాడులకు దారి తీశాయి.
Thailand-Cambodia | ఇరు దేశాలు అప్రమత్తం
దాడులు, ప్రతిదాడులతో ఇరు దేశాలు అప్రమత్తం అయ్యాయి. థాయిలాండ్ తమ సార్వభౌమత్వంపై దాడి చేయడంతో తమ దళాలు స్పందించాయని కంబొడియా ప్రభుత్వం (Cambodia Government) పేర్కొంది. మరోవైపు దాడులతో సరిహద్దు గ్రామాల్లో ఆందోళన నెలకొంది. దీంతో థాయిలాండ్ సరిహద్దు గ్రామాల్లోని పాఠశాలలకు సెలవులు ఇచ్చింది.