HomeUncategorizedYouTuber Arrest | గూఢచర్యం ఆరోపణలపై హర్యానా యూట్యూబర్​ అరెస్ట్​..

YouTuber Arrest | గూఢచర్యం ఆరోపణలపై హర్యానా యూట్యూబర్​ అరెస్ట్​..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: YouTuber Arrest | గూఢచర్యం ఆరోపణలపై హర్యానా యూట్యూబర్​ జ్యోతి మల్హోత్రాను (youtuber jyoti malhotra) హిసార్ పోలీసులు (hiser police) అరెస్ట్​ చేశారు. పాక్​లో ఐఎస్​ఐ అధికారులతో (pakistan ISI officials) సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్లు గుర్తించారు. ఆమె గతంలో ట్రావెల్​ వీసాపై పాకిస్తాన్​లో​ పర్యటించింది. ట్రావెల్​ విత్​ జో పేరుతో యూట్యూబ్​ ఛానెల్​ (youtube channel) నడుపుతోంది. ఈ క్రమంలో.. భారత సైనిక సమాచారం పాకిస్తాన్​కు​ చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. గూఢచర్యం ఆరోపణలపై ఆమెతో సహా మొత్తం ఆరుగురిని అరెస్ట్​ చేసినట్లు సమాచారం. కాగా.. పాకిస్తాన్ పర్యటనకు జ్యోతి మల్హోత్రాకు సహాయం చేసిన డానిష్ అనే పాకిస్తాన్ హైకమిషన్ అధికారితో (pakistan high commission official) ఆమెకు పరిచయం ఉందని తెలుస్తోంది.