అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai | ఇటీవల కురిసిన అకాల వర్షాలతో (unseasonal rains) జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ప్రధాన రహదారులు కొట్టుకుపోయాయి. రోడ్లు కుచించుకుపోయాయి. ఇందల్వాయి తండా నుంచి ఇందల్వాయి గ్రామానికి (Indalwai Thanda to Indalwai village) వెళ్లే దారి వర్షాలకు కుంగిపోయింది.
ఈ క్రమంలో శనివారం హార్వెస్టర్ (harvester) కుంగిన రోడ్డులో ఇరుక్కుపోయింది. ఎంత శ్రమించినప్పటికి హార్వెస్టర్‌ను బయటకు తీసుకురాలేకపోయారు. చివరికి జేసీబీని తీసుకొచ్చి బయటకు లాగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే కోతకు గురైన రోడ్లకు మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు.
