Homeబిజినెస్​Harrier EV | టాటా సంచలనం.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 627 కిలోమీటర్లు ప్రయాణించే కారు​..

Harrier EV | టాటా సంచలనం.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 627 కిలోమీటర్లు ప్రయాణించే కారు​..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: harrier ev | మార్కెట్లో ఎలక్ట్రిక్‌ కార్ల(Electric cars) తాకిడి పెరిగింది. ఇప్పటికే పలు కంపెనీల ఎలక్ట్రిక్‌ కార్లు అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని మోడల్‌ కార్లును లాంచ్‌ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి. భారత ఈవీ కార్ల మార్కెట్‌లో ఆధిపత్యం కొనసాగిస్తున్న టాటా మోటార్స్‌(Tata motors).. తాజాగా మరో మోడల్‌ను తీసుకువచ్చింది. తన ఫ్లాగ్‌షిప్‌ కార్లలో ఒకటైన హారియర్‌(Harrier)లో ఎలక్ట్రిక్‌ వేరియంట్‌(Electric variant)ను భారత మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. ఈ కారు (ఎక్స్‌ షోరూమ్‌) ప్రారంభ ధర రూ.21.49 లక్షలుగా ప్రకటించింది. టాప్‌ మోడల్‌ ధర రూ. 27 లక్షలకుపైగా ఉండొచ్చని అంచనా. దీని బ్యాటరీ ప్యాక్‌కు లైఫ్‌టైమ్‌ వారంటీ(Lifetime warranty) ఉంటుందని టాటా పేర్కొంది. విలాసవంతమైన(Luxury) కార్లలో లభించే పలు ఫీచర్లను ఇందులో ఉన్నాయి. 2వ తేదీ నుంచి బుకింగ్స్‌ మొదలయ్యాయి. డెలివరీ కి రెండు నెలలు పట్టవచ్చని అంచనా. ఈ మోడల్‌ కారు ఫీచర్లేమిటో తెలుసుకుందామా..

బ్యాటరీ : 65kWh(ఎంట్రీ లెవల్‌, సింగిల్‌ మోటార్‌, ఆర్‌డబ్ల్యూడీ), 75 kWhచ్(డ్యుయల్‌ మోటార్‌, క్యూడబ్ల్యూడీ).

సుదూర ప్రయాణాలకు ఇది అనుకూలంగా ఉంటుంది. దీనిని ఒక్కసారి చార్జి చేస్తే 627 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఒక కారులో నుంచి మరో కారుకు చార్జింగ్‌ చేసుకొనే అవకాశం ఉంది. ఫాస్ట్‌ ఛార్జింగ్‌(Fast charging) మోడ్‌లో పెడితే 15 నిమిషాల్లో 250 కిలోమీటర్ల ప్రయాణానికి సరిపడేలా బ్యాటరీ సిద్ధమవుతుంది.

రేంజ్‌ : 480 నుంచి 505 కిలోమీటర్లు.

పవర్‌ : డ్యుయల్‌ మోటార్‌ సెటప్‌ 313 hp, 504 Nm టార్న్‌ను అందిస్తుంది. 6.3 సెకన్లలో జీరో నుంచి 100 స్పీడును అందుకుంటుంది.

డిజైన్‌: ఈ హరియర్‌ ఈవీ కారు లుక్‌ పెట్రోల్‌ వర్షన్‌ను పోలి ఉంటుంది. ముందు భాగంలో క్లోజ్డ్‌ గ్రిల్‌, కొత్తగా రూపొందించిన బంపర్‌ ఉన్నాయి. ఇది నిలువు స్లాట్‌లను కలిగి ఉంది. కొత్త స్టైల్‌ అల్లాయ్‌ వీల్స్‌ను ఏర్పాటు చేశారు. 14.5 అంగుళాల శాంసంగ్‌ నియో క్యూఎల్‌ఈడీ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ను అమర్చారు. దీనిని జేబీఎల్‌ బ్లాక్‌ 10 స్పీకర్‌ సిస్టమ్‌, డాల్బీ అట్మోస్‌కు అనుసంధానించారు. 10.25 అంగుళాల డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే ఉంది.

కలర్స్‌: ఎంపవర్డ్‌ ఆక్సైడ్‌, నైనిటాల్‌ నక్టర్న్‌, ప్రిస్టైన్‌ వైట్‌, ప్యూర్‌ గ్రే. పూర్తిగా నలుపు రంగులోని స్టెల్త్‌ ఎడిషన్‌ కూడా విక్రయించనుంది.

Harrier EV | సేఫ్టీ ఫీచర్లు..

  • ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు(హైయర్‌ ట్రిమ్‌లలో ఏడు) ఉన్నాయి. కారులో 540 డిగ్రీ కెమెరా ఉంది. లెవల్‌ 2 ఏడీఎస్‌, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌.
  • ఈ కారులో రిమోట్‌ ఫీచర్లు(Remote features) కూడా అదనపు ఆకర్షణగా ఉన్నాయి. ఆటోపార్క్‌ అండ్‌ సమన్‌ మోడ్‌ సాయంతో వాహనాన్ని రిమోట్‌ పార్కింగ్‌ చేయొచ్చు. ఇక స్మార్ట్‌ ఫోన్‌, స్మార్ట్‌ వాచ్‌, ఎన్‌ఎఫ్‌సీ కార్డు సాయంతో డిజిటల్‌ కీ యాక్సెస్‌ చేయొచ్చు. రిమోట్‌ స్టార్ట్‌, రివర్స్‌ వంటివి ఉన్నాయి. డ్రైవ్‌పే(Drivepe) ఆప్షన్‌ను కూడా టాటా అందుబాటులోకి తీసుకొచ్చింది. టోల్‌, పార్కింగ్‌ వంటి సేవలకు దీని ద్వారా చెల్లింపులు చేయవచ్చు. 5 స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌(Sefety rating)కు అర్హత పొందే సామర్థ్యం ఈ మోడల్‌కు ఉందని కంపెనీ పేర్కొంది.
  • డ్రిఫ్ట్‌, బూస్ట్‌ మోడ్‌లో డ్యూయల్‌ మోటార్‌ క్యూడబ్ల్యూడీ(క్వాడ్‌ వీల్‌ డ్రైవ్‌) నాలుగు చక్రాలకు శక్తిని సరఫరా చేస్తుంది. శాండ్‌, రాక్‌ క్రాల్‌, బూస్ట్‌మోడ్‌, ట్రాన్స్‌పరెంట్‌ మోడ్‌, ఆఫ్‌ రోడ్‌ అసిస్ట్‌ వంటి మోడ్‌లు ఉన్నాయి. ముఖ్యంగా ట్రాన్స్‌పరెంట్‌ మోడ్‌లో వాహనం కింద రోడ్డును నేరుగా స్క్రీన్‌లో చూడొచ్చు. ఇది ఆఫ్‌రోడ్‌ ప్రయాణాలకు ఉపయోగకరంగా ఉంటుంది.