అక్షరటుడే, మెదక్ : Harish Rao Slams Congress | రాష్ట్రంలో ఖాకీ బుక్ అందరికీ సమానమేనని డీజీపీ శివధర్‌రెడ్డి (DGP Shivdhar Reddy) చెప్పారని, ఇప్పుడది కాంగ్రెస్‌కు చుట్టం అయిందా అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. సంగారెడ్డి జైలులో ఉన్న బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలను శనివారం ఆయన పరామర్శించారు.
మెదక్ (Medak) పట్టణానికి చెందిన పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జైలులో ఉన్న వారిని హరీశ్‌రావు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ రాత్రి 12:30 గంటలకు 4 కార్ల కాన్వాయ్‌తో వార్డులు ఎందుకు తిరిగారని ప్రశ్నించారు. ఎన్నికల ముందు రోజు ఆయన డబ్బులు పంచారని ఆరోపించారు. అడ్డుకోవాల్సిన పోలీసులు సహకరించారన్నారు. ఎమ్మెల్యే ఓ ముస్లిం మహిళ ఇంటికి వెళ్లి బెదిరించారన్నారు. ఆయన గన్‌మన్ మహిళపై దాడి చేశారని ఆరోపించారు.
Harish Rao Slams Congress | ఎమ్మెల్యేపై కేసు పెట్టాలి
ఎన్నికల ప్రచారం అయిపోయినా రాత్రి 12:30 గంటలకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిత్ (MLA Rohit) మీద, ఇతర కాంగ్రెస్ నాయకుల మీద కేసులు ఎందుకు పెట్టలేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. మైనంపల్లి రోహిత్ కారును తన కాలుపై నుంచి తీసుకుపోయాడని బీఆర్ఎస్ కార్యకర్త ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదన్నారు. బీఆర్ఎస్ (BRS) కార్యకర్త ఆటోపై ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు పెట్రోల్ చల్లి తగలబెట్టారన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ కార్యకర్తకు సంబంధించిన ఒక టిప్పర్‌ను కాంగ్రెస్ గుండాలు పెట్రోల్ పోసి కాలబెట్టారని ఆయన పేర్కొన్నారు.
Harish Rao Slams Congress | ఆ ఎన్నికలు ఎప్పుడు
కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి (Jaggareddy) పోలీసులను ఇష్టమొచ్చినట్లు బూతులు తిట్టారని, బీజేపీ ఎంపీ అర్వింద్ (MP Arvind) పోలీసులను గల్లా పట్టి కొట్టండి అన్నారని హరీశ్‌రావు చెప్పారు. వాళ్ల మీద చర్యలు తీసుకునే దమ్ము లేదని విమర్శించారు. రాష్ట్రంలో మూడు మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేశారని, ఆ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్‌ను చేతిలో పెట్టుకుని ఎన్నికలు నిరవధికంగా వాయిదా వేశారని, నాలుగు రోజులైనా ఎన్నికల డేట్ ఎందుకు ఇవ్వడం లేదన్నారు. స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లను కాంగ్రెస్ నాయకులు గుంజుకునే వరకు వేచి చూసి అప్పుడు ఎన్నికలు పెడతారా అని ప్రశ్నించారు.
1 comment
[…] […]
Comments are closed.