అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao Medak Comment | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మెదక్ జిల్లాకు రావడానికి భయపడ్డారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆయనకు జిల్లాకు వచ్చే ముఖం లేదన్నారు.మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం పలు జిల్లాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఆయన మెదక్ జిల్లా (Medak District)లో ప్రచారానికి రాలేదు. మెదక్‌లో తాను ఉండటంతో సీఎం రావడానికి భయపడ్డారని హరీశ్‌రావు అన్నారు. సోమవారం ఆయన దుబ్బాకలో ప్రచారం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ హామీలు అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, గ్యారెంటీలు గారడీలపై మెదక్ ప్రజలు నిలదీస్తారని సీఎం ఇటు వైపు చూడటం లేదన్నారు.
Harish Rao Medak Comment | ఓడిపోతామని..
మెదక్ జిల్లాలో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ నాయకులు (Congress Leaders) ప్రచారానికి రావాలని కోరినా సీఎం రాలేదన్నారు. జిల్లాలో గెలిచే పరిస్థితి లేదని, వస్తే తన పరువు పోతుందని ప్రచారానికి సీఎం రాలేదని ఎద్దేవా చేశారు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ పోయిన సీఎం జిల్లాకు మాత్రం రాలేదన్నారు. సీఎం మెదక్‌కు వస్తే ఏడుపాయల దుర్గమ్మ, కొమరవెల్లి మల్లన్న ఊరుకుంటారా అన్నారు. ఆయన దేవుళ్లను మోసం చేశారని వ్యాఖ్యానించారు.ఉమ్మడి మెదక్ జిల్లాలో మెజారిటీ మున్సిపల్ సీట్లను కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. ఈ మేరకు హరీశ్‌రావు నిత్యం ప్రచారంలో పాల్గొంటున్నారు. మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ (BRS)కు మంచి పట్టు ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో మిగతా ప్రాంతాల్లో చతికిలపడిన బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లాలో మాత్రం మంచి సీట్లు సాధించింది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) గెలిచి సత్తా చాటాలని గులాబీ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది.