Harish Rao
Harish Rao | తెలంగాణపై కేంద్రం కక్ష

అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao | కేంద్ర ప్రభుత్వం (Central Governament) తెలంగాణపై కక్ష కట్టిందని మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao) ఆరోపించారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్​కు (Andhra pradesh) నిధులు ఇస్తున్న కేంద్రం.. తెలంగాణపై వివక్ష చూపుతోందన్నారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు (BJP MPs).. ఇద్దరు కేంద్ర మంత్రులు (Cental minister) ఉన్నా నిధులు తీసుకు రావడం లేదన్నారు. ఏపీలోని పోలవరం ప్రాజక్ట్​కు (Polavaram project) జాతీయ హోదా ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణకు మొండిచేయ్యి చూపిందన్నారు.

ఆంధ్రప్రదేశ్​లో ప్రాజెక్టుల నిర్మాణానికి (projects construction) రూ.లక్ష 60 వేల కోట్లు కేంద్రం ఇచ్చినప్పుడు, తెలంగాణకు అందులో ఒక శాతం కూడా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అసెంబ్లీలో నీతి ఆయోగ్‌ మీటింగ్‌ని బాయ్‌కాట్ చేస్తున్నామని అన్నాడని.. ఇప్పుడు ముందుకు ముందే వెళ్అలి సమావేశంలో కూర్చున్నారని ఎద్దేవా చేశారు.