Harish Rao
Harish Rao | కాంగ్రెస్ సర్కారు బీఆర్​ఎస్​ జీవోని కాపీ కొట్టింది.. హరీశ్​రావు సంచల‌న కామెంట్స్

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Harish Rao | ప్ర‌స్తుతం తెలంగాణ‌లో (telangana) బీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్ అన్న ప‌రిస్థితి నెల‌కొంది. ఒక‌రిపై ఒక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే మినీ అంగన్​వాడీ కార్యకర్తలను అంగన్​వాడీలుగా గుర్తించి పూర్తి జీతం చెల్లించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు (harish rao) డిమాండ్‌ చేశారు. అంగన్​వాడీలుగా గుర్తించి ఏడాది దాటినా కాంగ్రెస్‌ ప్రభుత్వం వారికి ఇప్పటికీ పెరిగిన జీతం ఇవ్వలేదంటూ ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. బీఆర్ఎస్ (BRS) ఇచ్చిన జీవోను కాపీ కొట్టి రేవంత్‌ సర్కారు(revanth governament) ప్రచారం చేసుకుంటోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మూడు నెలలు మాత్రమే పెంచిన జీతం ఇచ్చి గతేడాది కాలంగా వారిని పాత జీతానికే పని చేపించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Harish Rao | జీవో కాపీనా?

గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న మహిళల కడుపు కొడుతున్నది ఎవ‌రంటూ మండి ప‌డ్డారు హ‌రీశ్​రావు (harish rao). మే నెల జీతాన్ని 8 జిల్లాల్లో మాత్రమే ఇచ్చి మిగతా జిల్లాల వారికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మినీ అంగన్​వాడీలు (anganwadi) ప్రచార సాధనాలు కాదని, వారికి నిజమైన గౌరవం ఇవ్వాలంటూ ఆయ‌న డిమాండ్ చేశారు. జనవరి 2024 January నుంచి 12 నెలలకు పెరిగిన జీతాలు పూర్తి స్థాయిలో చెల్లించాలని డిమాండ్‌చేశారు. అంగన్​వాడీ కేంద్రాలుగా (anganwadi centers) మారిన ప్రతిచోటా హెల్పర్లను నియమించాలన్నారు. మే నెల పెరిగిన జీతాలు అందని జిల్లాల్లో తక్షణమే చెల్లించాలన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM revanth reddy) బహిరంగ లేఖ రాశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం (congress governamet) అధికారంలోకి వచ్చిన తర్వాత సీతక్క.. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మినీ అంగన్​వాడీలను అంగన్​వాడీలుగా గుర్తిస్తూ మొదటి సంతకం చేసిన సంగతి తెలిసిందే . 2023 డిసెంబర్ 15న ఇదే విషయంపై జీవో కూడా జారీ చేశారు. కానీ, అది గత బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS governament) ఇచ్చిన జీవో. దాన్నే తిరిగి కొత్తగా ప్రచారం కోసం విడుదల చేసి రాజకీయ (politics) లబ్ధి పొందే ప్రయత్నం చేశారు. మూడు నెలలు అంగన్​వాడీలుగా గుర్తించి, తిరిగి సంవత్సర కాలం మినీ అంగన్​వాడీ జీతాలతో పనిచేయించడంతో వీరి కుటుంబాలకు తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురిచేసింది. మినీ అంగన్​వాడీలు తమ హక్కుల కోసం మంత్రిని, అధికారులను అనేకసార్లు కలిసినా, ప్రభుత్వం స్పందించలేదు. బీఆర్ఎస్ పార్టీ (BRS party) ఈ విషయంపై ప్రశ్నించిన తర్వాత, 2025 ఏప్రిల్‌లో మళ్లీ పాత జీవోను తిరిగి విడుదల చేస్తూ, మినీ అంగన్​వాడీలను అంగన్​వాడీలుగా గుర్తిస్తున్నామని ప్రచారం చేసుకున్నారంటూ మండిప‌డ్డారు.