అక్షరటుడే, వెబ్‌డెస్క్:Kaleshwaram Commission | మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) కాళేశ్వరం కమిషన్ విచారణకు బయలు దేరారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అక్రమాలు నిగ్గు తేల్చడానికి ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ గోష్ కమిషన్ ఇటీవల మాజీ సీఎం కేసీఆర్(Formar CM KCR)తో పాటు, మాజీ మంత్రులు ఈటల రాజేందర్ (Eatala Rajendar), హరీశ్‌రావుకు నోటీసులు అందించిన విషయం తెలిసిందే.
కాళేశ్వరం నిర్మాణ సమయంలో హరీశ్‌రావు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ఈ నెల 6న కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మంత్రివర్గ నిర్ణయం మేరకు నిధులు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే ప్రాజెక్ట్ డిజైన్ మార్పు గురించి సాంకేతిక అంశాలపై తమకు అవగాహన ఉండదన్నారు. తాజాగా హరీశ్‌రావు విచారణకు హాజరు కానుండటంతో ఆయన ఎం చెబుతారనే ఉత్కంఠ నెలకొంది.
Kaleshwaram Commission | అందుబాటులో ఉన్న సమాచారం అందిస్తాం
కాళేశ్వరం విచారణ కోసం హరీశ్‌రావు కోకోపేటలోని తన నివాసం నుంచి తెలంగాణ భవన్(Telangana Bhavan)కు బయలు దేరారు. అక్కడి నుంచి ఆయన విచారణకు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము ప్రభుత్వంలో లేము అని, అందుబాటులో ఉన్న సమాచారం అందిస్తామని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ మీద, చట్టాల మీద, రాజ్యాంగం మీద తమకు అపారమైన నమ్మకం ఉందన్నారు. అందుకే కమిషన్ ముందు హాజరు అవుతున్నామని తెలిపారు. కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతామన్నారు. ప్రభుత్వం విద్వేషంతో ఆలోచన చేయకూడదని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు(Farmers) అన్యాయం చేస్తుందని హరీవ్‌రావు విమర్శించారు. రాజకీయాల కోసం తెలంగాణ నీటి హక్కులను కాల రాయొద్దని ఆయన కోరారు.
Kaleshwaram Commission | 11న కేసీఆర్
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (BRS chief KCR) కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈ నెల 11న విచారణకు హాజరు కానున్నారు. ఆయనకు ఈ నెల 5నే హాజరు కావాలని కమిషన్ నోటీసులు (Commission Notices) ఇచ్చింది. కానీ ఆయన 11న హాజరు అవుతానని కోరడంతో కమిషన్ అంగీకరించింది. కేసీఆర్ విచారణ అనంతరం కాళేశ్వరం కమిషన్ పూర్తి నివేదిక సిద్ధం చేసి ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి సమర్పించున్నట్లు సమాచారం.