అక్షరటుడే, మెదక్ : Harish Rao allegations | ఫోరెన్సిక్ ల్యాబ్ (FSL)లో జరిగిన అగ్ని ప్రమాదం వెనుక సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) హస్తం ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. పోలీసుల సహకారంతో ఈ కుట్ర పన్నారన్నారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హరీశ్‌రావు సోమవారం మెదక్ (Medak)లో ప్రచారం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ రేవంత్‌రెడ్డి అన్నారు. జైలుకు పోయే సమయం దగ్గరకు వచ్చిందని, అందుకే సాక్ష్యాలు మాయం చేసేందుకు నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌ను దహనం చేశారన్నారు.
Harish Rao allegations | సాక్ష్యాలు మాయం
జైలుకు పోకుండా ఉండేందుకు సాక్ష్యాలను మాయం చేశారని హరీశ్‌రావు ఆరోపించారు. రేవంత్ డైరెక్షన్లో పోలీసులు చేసిన దహనఖండ అన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకు వెళ్లక తప్పదన్నారు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. రంజాన్ తోఫా కూడా ఇవ్వడం లేదన్నారు. షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి రావడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లను గెలిపించుకోకుంటే బిల్లులు రావని బెదిరిస్తున్నారన్నారు. మెదక్‌లో చిల్లర బెదిరింపులకు భయపడం అని స్పష్టం చేశారు. బిల్లులు ఏమైనా జేబులో నుంచి ఇస్తున్నారా అని ప్రశ్నించారు.
మెదక్ మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగుర వేస్తామని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, నాయకులు బట్టి జగపతి, మామిళ్ల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
1 comment
[…] మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. 80 శాతం నీళ్లు ఏపీ వాడుకుందని […]
Comments are closed.