Homeతాజావార్తలుTanniru Harish Rao | మాజీ మంత్రి తన్నీరు హరీశ్​ రావుకు పితృ వియోగం.. కుటుంబంలో...

Tanniru Harish Rao | మాజీ మంత్రి తన్నీరు హరీశ్​ రావుకు పితృ వియోగం.. కుటుంబంలో విషాద ఛాయ‌లు!

Tanniru Harish Rao | మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కుటుంబంలో విషాదం నెలకొంది. హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు. ఆయన మరణంతో తన్నీరు కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Tanniru Harish Rao | మాజీ మంత్రి తన్నీరు హరీశ్​ రావు కుటుంబంలో విషాదం నెలకొంది. హరీశ్​ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు. ఆయన మరణంతో తన్నీరు కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.

బీఆర్‌ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే Siddipet MLA తన్నీరు హరీశ్​ రావు Harish Rao కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. హరీశ్​ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు ఈరోజు (మంగళవారం, అక్టోబరు 28) ఉదయం తుదిశ్వాస విడిచారు.

వయోభారం, అనారోగ్య సమస్యల కారణంగా కొద్దికాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన ఈరోజు కన్నుమూశారు. తండ్రి మరణంతో హరీశ్​ రావు కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు హరీశ్​ రావు నివాసానికి చేరుకొని సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Tanniru Harish Rao | తీవ్ర విషాదం..

రాజకీయ జీవితంలో హరీశ్​ రావు ఎదుగుదలకు సత్యనారాయణ Tanniru Satyanarayana మార్గదర్శకత్వం, ప్రోత్సాహం ఎంతగానో ఉందని ఆయన సన్నిహితులు గుర్తుచేసుకుంటున్నారు.

సమాజంలో చురుకైన వ్యక్తిగా పేరుపొందిన సత్యనారాయణ, ప్రజలతో మమేకమై ఉండేవారని స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. మాజీ మంత్రి తండ్రి మరణ వార్త తెలిసిన వెంటనే బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, నాయకులు హరీశ్​ రావు Harish Rao ఇంటికి వెళ్లి సత్యనారాయణ గారి భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు.

ఈ కష్ట సమయంలో హరీశ్​ రావు కుటుంబానికి ధైర్యం చేకూరాలని అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రార్థిస్తున్నారు. ప్ర‌స్తుతం హైదరాబాద్‌ కోకాపేటలోని క్రిన్స్‌ విల్లాస్‌లో ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు.

ఈ రోజు సాయంత్రం ఆయ‌న అంత్య‌క్రియ‌లు జ‌ర‌ప‌నున్న‌ట్లు సమాచారం. హ‌రీశ్​ తండ్రి మృతిపై  పలువరు బీఆర్​ఎస్​ నాయకులు BRS leaders సామాజిక మాధ్యమాల Social Media వేదికగా సంతాపం తెలుపుతున్నారు.