Harish Rao Demands Halt | పేదల ఇళ్ల కూల్చివేతలను ఆపాలి : హరీశ్​రావు

ఖమ్మం జిల్లా వినోబానగర్‌లో పేదల ఇళ్ల కూల్చివేతలను ఆపాలని హరీశ్​రావు డిమాండ్​ చేశారు. ప్రభుత్వ తీరును ఆయన ఖండించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao Demands Halt | ఖమ్మం జిల్లా (Khammam District) వెలుగుమట్ల వినోబానగర్‌ (Vinobanagar)లో అప్పులు చేసి పేదలు నిర్మించుకున్న ఇళ్లను, వేల మంది పోలీసుల పహారాలో కూల్చివేయడం అత్యంత హేయమైన చర్య అని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. ఇది ప్రజాస్వామ్యమా? లేక పోలీస్ రాజ్యమా? అని ప్రశ్నించారు.

వెలుగుమట్ల (Velugumatla)లో భూదాన్ భూముల్లో ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట నుంచి అదనపు బలగాలు రప్పించారు. ఏడేళ్లుగా భూదాన్ భూముల్లో ఇళ్లు కట్టుకుని దాదాపు 600 మంది నివాసం ఉంటున్నారు. మంగళవారం ఉదయం నుంచి అధికారులు ఆక్రమణలను తొలగిస్తున్నారు. అయితే పలువురు బాధితులు జేసీబీలకు అడ్డం పడుకొని ఆందోళన చేశారు. బాధితులను పోలీసులు పక్కకు పంపించారు. ఈ ఘటనపై హరీశ్​రావు (Harish Rao) ఎక్స్​ వేదికగా స్పందించారు.

Harish Rao Demands Halt | చీకటి పనులు చేసేవారు..

నాలుగు జిల్లాల నుంచి వేల మంది పోలీసులను మోహరించి, యుద్ధ వాతావరణాన్ని సృష్టించి పేదల ఇళ్లను కూల్చాల్సిన అవసరం ఏమొచ్చిందని మాజీ మంత్రి ప్రశ్నించారు. పేద ప్రజలు తీవ్రవాదుల్లా కనిపిస్తున్నారా అన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని మీడియాను రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. చీకటి పనులు చేసేవారే మీడియాను చూసి భయపడతారన్నారు. అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి.. నేడు ఉన్న ఇళ్లను కూలగొట్టి పేదలను నడిరోడ్డుపై నిలబెడుతున్నారని మండిపడ్డారు.

Harish Rao Demands Halt | ప్రత్యామ్నాయం చూపాలి

ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చడం అమానుషమని ఆయన అన్నారు. వెంటనే అక్రమ కూల్చివేతలను ఆపాలని డిమాండ్​ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇంచు భూమి కూడా కదిలించడానికి వీల్లేదన్నారు.

Related articles

Lakshman Rathod Award | లక్ష్మణ్ రాథోడ్​కు ఇండియన్ బెస్ట్ ఇన్​స్పిరేషన్​ అవార్డు

విద్యార్థులకు, క్రీడాకారులకు ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ.. వారి ఉన్నతికి విశేష కృషి చేస్తున్న జడ్పీహెచ్​ఎస్​ పేట్​సంగం పీఈటీ, బామన్​ నాయక్​ స్పోర్ట్స్​ ఫౌండేషన్​ వ్యవస్థాపకుడు లక్ష్మణ్​రాథోడ్​కు ఇండియన్​ బెస్ట్​ ఇన్​స్పిరేషన్ అవార్డు వరించింది.

KTR BRS Statement | బీఆర్​ఎస్​ అధికారంలోకి రాగానే కాంగ్రెస్​ అరాచకాలను బయటపెడతాం: కేటీఆర్​

బీఆర్​ఎస్​ అధికారంలోకి రాగానే కాంగ్రెస్​ అరాచకాలను ఒక్కొక్కటిగా బయటపెడతామని కేటీఆర్​ అన్నారు. హైదరాబాద్​ నుంచి ఆదిలాబాద్​ వెళ్తూ ఆర్మూర్​లో ఆగారు.

Arvind Ukraine Group | ఉక్రెయిన్ పార్లమెంటరీ ఫ్రెండ్​షిప్ గ్రూప్ టీం లీడర్​గా ఎంపీ అర్వింద్

ఉక్రెయిన్ పార్లమెంటరీ ఫ్రెండ్​షిప్ గ్రూప్ టీం లీడర్​గా ఎంపీ అర్వింద్ నియమితులయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం ఈ బృందం లక్ష్యం.

Tirumala Laddu Adulteration Issue | తిరుమల లడ్డూ కల్తీపై అసెంబ్లీలో చర్చ.. కుట్ర ఉందన్న సీఎం

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. 2019-24 మధ్య దేవాలయాల్లో అరాచకాలు జరిగాయని సీఎం చంద్రబాబు అన్నారు.