Harish Rao Criticizes Revanth | సీఎం చేసిందేమి లేదు.. కూల్చిందే ఎక్కువ : హరీశ్​రావు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao Criticizes Revanth | కాంగ్రెస్​ ప్రభుత్వం, సీఎం రేవంత్​రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్​రావు విమర్శలు చేశారు. రెండేళ్ల పాలనలో సీఎం చేసిందేమి లేదని, కూల్చిందే ఎక్కువ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ (Musi Beautification) చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బాపూఘాట్​ (Bapu Ghat)లో గాంధీజీ విగ్రహం పెట్టాలని నిర్ణయించింది. స్థల సేకరణ కోసం పలువురికి నోటీసులు ఇచ్చింది. దీంతో తమ ఇళ్లు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao Criticizes Revanth | కాంగ్రెస్​ ప్రభుత్వం, సీఎం రేవంత్​రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్​రావు విమర్శలు చేశారు. రెండేళ్ల పాలనలో సీఎం చేసిందేమి లేదని, కూల్చిందే ఎక్కువ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ (Musi Beautification) చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బాపూఘాట్​ (Bapu Ghat)లో గాంధీజీ విగ్రహం పెట్టాలని నిర్ణయించింది. స్థల సేకరణ కోసం పలువురికి నోటీసులు ఇచ్చింది. దీంతో తమ ఇళ్లు పోతున్నాయని బాధితులు ఆందోళన చెందుతున్నారు. వారితో హరీశ్​రావు ఆదివారం హైదర్​ షా కోట్​లో సమావేశం అయ్యారు. గాంధీజీ  అహింసావాదని, అలాంటి అహింసామూర్తి విగ్రహాన్ని పెట్టడానికి రేవంత్ రెడ్డి హింసాత్మక మార్గాన్ని ఎంచుకున్నారని విమర్శించారు.

Harish Rao Criticizes Revanth | మధ్య తరగతి వారి పరిస్థితి ఏంటీ

మధ్యతరగతి కుటుంబానికి ఇల్లు అనేది ఒక కల అని హరీశ్​రావు అన్నారు. ​రెక్కల కష్టంతో పైసా పైసా పోగుచేసుకొని, బ్యాంకుల్లో అప్పులు తెచ్చి మరీ ఇల్లు కొనుక్కుని కల నిజం చేసుకుంటే
రేవంత్​రెడ్డి వచ్చి బుల్డోజర్లు పెట్టి ఆ ఇండ్లు కూలుస్తామని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం నీకేంది జూబ్లీహిల్స్ (Jubilee Hills) ప్యాలెస్లో బాగానే ఉన్నారని, ఇంకో 100 కోట్లతో ఇంకో ప్యాలెస్ కూడా కట్టుకుంటారన్నారు. మరి ఈ మధ్య తరగతి ప్రజల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.

Harish Rao Criticizes Revanth | అండగా ఉంటాం

మూసీ ప్రాజెక్టు (Musi Project)కు ఇప్పటివరకు డీపీఆర్ తయారు కాలేదని హరీశ్​రావు పేర్కొన్నారు. ఇప్పటివరకు గరిష్ట వరద స్థాయిని సైతం నిర్ధారించలేదని చెప్పారు. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదని, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకురాలేదని చెప్పారు. ఇవన్ని లేకుండా ఇండ్లు కూల్చేస్తామని నోటీసులు ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. దీనిపై న్యాయపరంగా మూసీ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బాధితుల తరఫున మాట్లాడుతామన్నారు.

బీఆర్ఎస్ (BRS) అధికారంలో ఉన్నప్పుడు మూసీలోకి మురుగు నీరు రాకుండా రూ.3,800 కోట్లతో 38 STPలు నిర్మించామని ఆయన గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి నీళ్లను మూసీలో కలిపేందుకు ప్రణాళికలు తయారు చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్​ ప్రభుత్వం దాన్ని కొనసాగించకుండా, మూసీ అభివృద్ధి పేరిట ఇండ్లు కూల్చడం దేనికని ప్రశ్నించారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

Eco Run 2.0: మాదాపూర్‌లో మైండ్‌స్పేస్ ఈకో రన్ 2.0 సందడి.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా 4,200 మంది పరుగు

హైదరాబాద్: ఐటీ హబ్ మాధాపూర్‌లో ఆదివారం ఉదయం పరుగు ఉత్సాహం ఉప్పొంగింది. మైండ్‌స్పేస్ REIT, మిర్చి సంయుక్తంగా నిర్వహించిన మైండ్‌స్పేస్ ఈకో రన్ 2.0...

Yendala Arrest | యెండల లక్ష్మీనారాయణ అరెస్ట్

అక్షరటుడే, బాన్సువాడ : Yendala Arrest | బాన్సువాడ (Banswada) పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణల్లో గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్తున్న బాన్సువాడ నియోజకవర్గ...

RTC Bus Accident Mendora | ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యవసాయ కూలీ మృతి

అక్షరటుడే, మెండోరా : RTC Bus Accident Mendora | ఆర్టీసీ బస్సు (RTC Bus) ఢీకొని వ్యవసాయ కూలీ మృతి చెందాడు. ఈ...

Ramchander Rao Arrest | బీజేపీ చీఫ్ రాంచందర్ రావు అరెస్ట్..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ramchander Rao Arrest | బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావును పోలీసులు అరెస్ట్​ చేశారు. కామారెడ్డి (Kamareddy), బాన్సువాడ...