అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao Counter | ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో సిట్‌కు నేతృత్వం వహిస్తున్న సజ్జనార్ ట్వీట్‌కు మాజీ మంత్రి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. కోర్టు తీర్పు లేకుండానే ఫోన్ ట్యాపింగ్‌ను అక్రమం అని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఆదివారం విచారించిన విషయం తెలిసిందే. అనంతర హైదరాబాద్ సీపీ సజ్జనార్ (CP Sajjanar) ఎక్స్ వేదికగా సిట్ విచారణపై వివరాలు వెల్లడించారు. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేసిన కేసులో కేసీఆర్ విచారణ ముగిసిందని ఆయన పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌పై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు దశలోనే తీర్పు చెప్పే అధికారం సిట్ చీఫ్‌కు లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ చట్టబద్దమా కాదా అనేది కోర్టు మాత్రమే నిర్ణయించాలన్నారు. ఈ కేసు విషయంలో సిట్ చీఫ్ ముందే ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నట్లు కన్పిస్తోందని హరీశ్‌రావు అన్నారు.
Harish Rao Counter | న్యాయమూర్తులు కారు
పోలీసులకు దర్యాప్తు బాధ్యత మాత్రమే అప్పగించారని హరీశ్ రావు అన్నారు. విచారణ దశలో ఏదైనా చర్యను చట్టవిరుద్ధమని ప్రకటించడానికి వారు న్యాయమూర్తులు, న్యాయనిర్ణేతలు కాదని స్పష్టం చేశారు. ఏదైనా ఫోన్ అంతరాయం చట్టబద్ధమైనదా లేదా చట్టవిరుద్ధమా అనేది ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం (Indian Telegraph Act)లోని సెక్షన్ 5(2), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, PUCL vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) నిర్దేశించిన రక్షణలను ఖచ్చితంగా పాటించడంపై ఆధారపడి ఉంటుందన్నారు. SIT అధిపతి విచారణకు ముందే నేరాన్ని అంగీకరించే భాషను స్వీకరించినప్పుడు, అది ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరుస్తుందన్నారు.