అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao Congress Land Prices | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో భూముల ధరలు పడిపోయాయని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) భాగంగా శనివారం ఆయన గజ్వేల్‌లో ప్రచారం చేశారు.
కేసీఆర్ హయాంలో గజ్వేల్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని హరీశ్‌రావు తెలిపారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో గజ్వేల్ ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది అని ప్రశ్నించారు. కాంగ్రెస్ (Congress) వచ్చాక పట్టణంలో ఎక్కడైనా సీసీ రోడ్డు వేశారా అన్నారు. దొంగ హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కొత్త రోడ్లు వేయలేదని, ఉన్న రోడ్లు బాగు చేయలేదన్నారు. రూ.200 పెన్షన్‌ను కేసీఆర్ రూ.2 వేలకు పెంచారని చెప్పారు. కాంగ్రెస్ వాళ్లు రూ.4 వేలు పెన్షన్ పెంచుతామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు.
Harish Rao Congress Land Prices | చేసిందేమి లేదు
కేసీఆర్ (KCR) హయాంలో తెలంగాణలో భూముల రేట్లు పెరిగాయని హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధరలు భారీగా పడిపోయాయన్నారు. బంగారం ధరలు పెరిగి, భూముల ధరలు తగ్గాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ (Telangana)ను కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధికారంలోకి వచ్చాక కొత్తగా చేసిందేమి లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన భవనాలకు ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీపై సైతం మాజీ మంత్రి విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం పాల ధరలు, జీఎస్టీలు పెంచింది తప్ప.. చేసిందేమీలేదని లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.