అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kavitha Janam Bata | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) జనంబాట కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఆమె హవేలి ఘన్పూర్ మండల (Ghanpur Mandal) కేంద్రంలో పాడిరైతులతో మాట్లాడారు. అనంతరం మెదక్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ, హరీశ్‌రావుపై ఆమె విమర్శలు చేశారు.
హరీశ్ రావు (Harish Rao) కుటుంబం, ప్రైవేట్‌గా పాల వ్యాపారాలు చేసి పాల రైతులకు అన్యాయం చేసిందని కవిత ఆరోపించారు. ఎలాంటి టెండర్లు లేకుండానే హాస్టళ్లకు పాలు సప్లై చేసి డబ్బు సంపాదించుకున్నారని విమర్శించారు. మెదక్ నుంచి హరీశ్ రావు మంత్రిగా పనిచేసినా లాభం లేకుండా పోయిందన్నారు. మెదక్‌లో మినీ ట్యాంక్ బండ్ (mini tank bund) హామీ గాలికి పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశార. అన్నదాలకు సాగునీరందక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రూరల్ ఏరియాల్లో పాడి రైతులకు న్యాయం జరగడం లేదన్నారు. హరీశ్ రావు బినామీలే ఈ పాల వ్యాపారం సాగిస్తున్నారని ఆరోపించారు.
Kavitha Janam Bata | అందుకే బీఆర్ఎస్ ఓడిపోయింది
ప్రతిపక్షం (BRS) తన పాత్రను సమర్థవంతంగా పోషించి ఉంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల (Jubilee Hills elections) ఫలితాలు భిన్నంగా ఉండేవి అని కవిత అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌పై రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత ఉందని కవిత పేర్కొన్నారు. అయినా కూడా జూబ్లీహిల్స్ అన్ని వేల ఓట్ల మెజార్టీతో ఎలా గెలిచిందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు ప్రతిపక్షంలో సరిగ్గా పనిచేయకపోవడంతోనే కాంగ్రెస్ గెలిచిందన్నారు. వాళ్లు సోషల్ మీడియాలో (social media) మాత్రమే ఉద్యమాలు చేస్తున్నారని విమర్శించారు.
Kavitha Janam Bata | ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చారు
బీఆర్ఎస్ నాయకుల ఫామ్‌హౌస్‌లు, భూములు (farmhouses and lands) కాపాడుకోవడానికి నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చారని ఆరోపించారు. దీంతో రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ ఫామ్‌హౌస్ హరీశ్‌రావుది అని స్థానికులు అంటున్నారని ఆమె చెప్పారు. హరీశ్‌రావు కోసం అలైన్మెంట్ మార్చారని ఆరోపించారు. మెదక్ జిల్లాను ఛార్మినార్ జోన్లో కలపాలని కవిత డిమాండ్ చేశారు. ప్రస్తుతం జిల్లా రాజన్న జోన్లో ఉండటంతో ప్రజలు హైదరాబాద్‌లో ఉద్యోగాలకు అప్లై చేసుకోలేకపోతున్నారన్నారు.
