అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్ విచారణ కోసం మాజీ మంత్రి హరీశ్‌రావు బీఆర్కే భవన్(BRK Bhavan)కు చేరుకున్నారు. మొదట తన నివాసం నుంచి తెలంగాణ భవన్‌కు వెళ్లిన ఆయన అనంతరం బీఆర్కే భవన్‌కు వెళ్లారు. పీసీ ఘోష్ కమిషన్(PC Ghosh Commission) ఆయనను విచారించనుంది. అయితే బహిరంగ విచారణలో తాము పాల్గొంటామంటూ బీఆర్‌ఎస్ న్యాయవాదులు పోలీసులతో వాగ్వాదం చేశారు. కాగా.. వారిని వెళ్లిపోవాలని పోలీసులు(Police) ఆదేశించారు. బహిరంగ విచారణకు ఎవరైనా హాజరు కావచ్చని పోలీసులతో వారు వాగ్వాదం చేశారు. కాగా హరీశ్‌రావు(Harish Rao) విచారణ సందర్భంగా బీఆర్కే భవన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
