నటీనటులు : పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, నాజర్, సునీల్, రఘుబాబు తదితరులు
దర్శకుడు : క్రిష్ జాగర్లమూడి – జ్యోతికృష్ణ
నిర్మాణం : మెగా సూర్య ప్రొడక్షన్స్
సంగీతం : ఎం ఎం కీరవాణి
సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్
ఎడిటింగ్ : ప్రవీణ్ కే ఎల్
అక్షరటుడే, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక వస్తున్న తొలి చిత్రం కావడంతో మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రానికి సినీ ప్రముఖులే కాకుండా పలువురు రాజకీయ నాయకులు కూడా విషెస్ తెలియజేశారు. చిత్ర ప్రమోషన్స్‌లో పవన్ కళ్యాణ్ యాక్టివ్‌గా పాల్గొని మూవీపై హైప్ పెంచే ప్రయత్నం చేశారు. మరి తాజాగా విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులని ఎంతగా అలరించిందో చూద్దాం.
కథ:
అది1650ల కాలం. భారతదేశం మొఘల్ ఆధీనంలో ఉంటుంది కోహినూర్ వజ్రం ఔరంగజేబ్ (బాబీ డియోల్) చేతికి చిక్కుతుంది. తన మతంలో మారలేకపోతే చావు తప్పదని అతను భారతీయులను భయపెడతాడు. ఈ వజ్రాన్ని తిరిగి తీసుకొచ్చే బాధ్యత తెలివైన చోరుడు హరిహర వీరమల్లుకి (పవన్ కళ్యాణ్) కుతుబ్ షా (దలీప్ తహిల్) అప్పగిస్తాడు. అయితే ఈ మిషన్ వెనుక మరొక కారణం కూడా ఉంది. వీరమల్లు వజ్రం కోసం వచ్చాడా? లేక ఇది ఒక వ్యక్తిగత ప్రతీకారమా? ఈ ప్రశ్నలకు సమాధానం తెరపై చూస్తే తెలుస్తుంది.
నటీనటుల పర్‌ఫార్మెన్స్:
పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది అభిమానులకు పండుగ వాతావరణం తీసుకొచ్చింది. ఎన్నో రోజుల తర్వాత అభిమానులు వెండి తెరపై పవన్‌ను అసలైన మాస్ లుక్‌లో చూసి తెగ ఆనందించారు. ప్రతీ ఎలివేషన్ సీన్ ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ కొత్త కోణాన్ని చూపించగా, నిధి అగర్వాల్ కూడా ఆకట్టుకుంది. ఆమె పాత్రలో ఉన్న ట్విస్ట్ బాగా వర్కవుట్ అయింది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయిన సునీల్, రఘుబాబు, నాజర్, సుబ్బరాజులు తమ తమ పాత్రలలో ఒదిగిపోయారు. బాబీ డియోల్ చేసిన ఔరంగజేబ్ పాత్రకు మంచి ఇంపాక్ట్ ఉంది. అతను తప్ప ఈ పాత్ర మరొకరు చేయలేరేమో అన్నట్టు నటించాడు.
టెక్నికల్ పర్‌ఫార్మెన్స్:
కీరవాణి సంగీతం సినిమాకు వెన్నెముకగా నిలిచింది. సినిమాలో అవుతుంది అనుకున్న సమయంలో కీరవాణి తన మ్యూజిక్‌తో సినిమాను పైకి లేపాడు. క్రిష్ & జ్యోతికృష్ణ కలిసి పీరియాడిక్ డ్రామాకి న్యాయం చేయాలని చాలా ప్రయత్నం చేశారు. ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ప్లాన్ చేసినా.. మిడ్ నరేషన్లో కొంచెం డిజైన్ లోపం ఉంది. సెట్స్, డ్రెస్ డిజైన్లు, కాలానికి తగ్గ ఆర్ట్ డైరెక్షన్ బాగున్నా, గ్రాఫిక్స్ అసలైన రిచ్‌నెస్ ఇవ్వలేకపోయాయి. సినిమాటోగ్రఫీ పవన్ ను అదిరిపోయే విధంగా చూపించింది. ఎడిటింగ్ పనితనంలో కూడా కొంత లోపం కనిపించింది.
ప్లస్ పాయింట్స్:
కీరవాణి సంగీతం
క్లైమాక్స్
ప్రీ క్లైమాక్స్
నటీనటుల పర్‌ఫార్మెన్స్
మైనస్ పాయింట్స్:
కథనం
మాస్ ఎలివేషన్ మూమెంట్స్
గ్రాఫిక్స్
చివరిగా..
హరిహర వీరమల్లు చిత్రం విడుదల కోసం ఇంత సమయం తీసుకున్నప్పటికీ మేకర్స్ మంచి విజువల్స్ అందించలేకపోయారు. ఫస్ట్ హాఫ్‌లో కనిపించిన పేస్, మేజిక్ సెకండ్ హాఫ్‌కి వచ్చే సరికి కొంత వరకు తగ్గిపోతుంది. కొన్ని సీన్లు ఊహాజనితంగా అనిపిస్తాయి. కథనంలో డైలాగ్స్ బలంగా ఉన్నా, స్క్రీన్‌ప్లే మరింత కట్టుదిట్టంగా ఉండాల్సింది. ‘హరిహర వీరమల్లు’ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు మాత్రం సరైన మాస్ ఫెస్టివల్. సనాతన ధర్మం కోసం సాగిన వీరయాత్రలో పవన్ చేసిన న్యాయ పోరాటం, అతని స్క్రీన్ ప్రెజెన్స్, మ్యూజిక్, ఎలివేషన్ సీన్లు ఈ చిత్రానికి హైలైట్. కొన్ని సన్నివేశాల్లో కథనం బలహీనంగా ఉన్నా కూడా, ఈ సినిమా డీసెంట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా పవన్ అభిమానులని బాగానే ఆకట్టుకుంటుంది.
రేటింగ్: 3.25/5