ePaper
More
    HomeసినిమాHari Hara Veeramallu | 13 సార్లు వాయిదా త‌ర్వాత మ‌రోసారి కొత్త రిలీజ్ డేట్.....

    Hari Hara Veeramallu | 13 సార్లు వాయిదా త‌ర్వాత మ‌రోసారి కొత్త రిలీజ్ డేట్.. వీర‌మ‌ల్లు ఈ సారైన రావ‌డం గ్యారెంటీనా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Hari Hara Veeramallu | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) న‌టించిన హరిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా విడుదల తేదీపై నెలకొన్న ఉత్కంఠకు తాజాగా తెరపడింది. ఈ సినిమాను జులై 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. 13 సార్లు మూవీని ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా వేశారు.వాస్తవానికి ఈ చిత్రం ఈనెల‌ 12న విడుదల కావాల్సి ఉండగా, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కారణాల వల్ల వాయిదా పడింది. ఇక ఇప్పుడు జూలై 24న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు కొద్ది సేప‌టి క్రితం ప్ర‌క‌టించారు.

    Hari Hara Veeramallu | ఈ సారైన వ‌స్తుందా..

    దీంతో అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికినట్లయింది. ‘హరిహర వీరమల్లు: పార్ట్‌ 1- స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’(Sword vs. Spirit) పేరుతో రానున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ మునుపెన్నడూ చూడని శక్తిమంతమైన చారిత్రక యోధుడి పాత్రలో కనిపించనున్నారు.సినిమా చిత్రీకరణ ఆలస్యం కావడం, సెట్స్ పై ఎక్కువ కాలం ఉండటంతో నిర్మాతపై ఆర్థిక భారం పడిందని భావించిన పవన్, తాను అడ్వాన్స్ గా తీసుకున్న పారితోషికాన్ని పూర్తిగా వెనక్కి ఇచ్చేసినట్లు సమాచారం. అంతేకాకుండా, తన బిజీ షెడ్యూల్ మధ్య కూడా సినిమా కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రాత్రి 10 గంటలకు డబ్బింగ్ పనులు మొదలుపెట్టి, ఏకధాటిగా నాలుగు గంటల్లో పూర్తి చేశారని చిత్ర వర్గాలు తెలిపాయి.

    హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు(Hari Hara Veeramallu)కి పోటీగా ఇప్పుడు కింగ్ డమ్ దిగుతుందా లేదా అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. విజయ్‌ దేవరకొండ కింగ్‌డమ్‌ మూవీ కూడా పలు మార్లు వాయిదా పడింది. జులై 4న విడుదల చేయాలని ప్రకటించారు. కానీ ఆ డేట్‌ కి రావడం లేదని తెలుస్తోంది. జులై 25న విడుదల చేయాలని భావిస్తున్నారట. ఈ క్రమంలో ప‌వ‌న్, విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌ధ్య క్లాష్ భీబ‌త్సంగా ఉంటుంద‌ని అంటున్నారు. లేదంటే విజయ్‌ మూవీని వాయిదా వేస్తారా? అనేది చూడాలి.ఈ పీరియాడికల్ యాక్షన్ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీర‌వాణి బాణీలు అందిస్తున్నారు.

    More like this

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...

    Hyderabad | మండీ బిర్యానీలో బొద్దింక.. షాకైన కస్టమర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | అరేబియన్​ మండీ బిర్యానీ (Arabian Mandi Biryani) తింటుండగా.. బొద్దింక రావడంతో...

    Hyderabad | జేబీఎస్​ బస్టాండ్​ వద్ద దుకాణాల కూల్చివేత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలోని జేబీఎస్​ (JBS) వద్ద బుధవారం ఉదయం ఉద్రిక్తత చోటు...