HomeUncategorizedHari Hara Veeramallu | తొలి రోజు రికార్డ్ క‌లెక్ష‌న్స్.. వీరమల్లు పార్ట్ 2 టైటిల్...

Hari Hara Veeramallu | తొలి రోజు రికార్డ్ క‌లెక్ష‌న్స్.. వీరమల్లు పార్ట్ 2 టైటిల్ రివీల్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hari Hara Veeramallu | పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైన‌ర్ ‘హరిహర వీరమల్లు’ జూలై 24న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చింది. రెండు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సిల్వర్ స్క్రీన్‌పై ప్రత్యక్షం కావడం, ఆయన స్వయంగా ప్రమోషన్స్‌లో పాల్గొనడం వల్ల సినిమా మీద హైప్ అమాంతం పెరిగింది. ఫలితంగా ఈ చిత్రం రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ సాధించింది. సినిమా రిలీజ్‌కు ముందు రోజు నుంచే ప్రారంభమైన ప్రీమియర్ షోలతో పాటు, దేశవ్యాప్తంగా జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్(Advance Bookings) ద్వారా రూ.32 కోట్ల వరకు గ్రాస్ వసూలైనట్లు సమాచారం. ఇది పవన్ కెరీర్‌లోనే అత్యధిక స్థాయి అడ్వాన్స్ సేల్స్‌లో ఒకటిగా నిలిచింది.

Hari Hara Veeramallu | క‌లెక్ష‌న్ల వ‌ర్షం..

మొత్తంగా, సినిమా విడుదలైన తొలి రోజే ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veeramallu) రూ.65–70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, అలాగే రూ.45 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ వసూళ్లు పవన్ గత చిత్రాలైన వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాల ఫస్ట్ డే కలెక్షన్లను మించిపోయినట్టు తెలుస్తోంది. ఈ వసూళ్లను బట్టి చూస్తే, ‘హరిహర వీరమల్లు’ సినిమా పవన్ కెరీర్‌లో టాప్ ఓపెనర్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఈ గణాంకాలు అధికారికంగా మూవీ యూనిట్ వెల్లడించాల్సి ఉంది. ఇప్పటికే థియేటర్లలో అభిమానుల సందడి కొనసాగుతోంది.

చిత్ర క్లైమాక్స్‌లో ఢిల్లీకి బ‌య‌లుదేరిన వీరమల్లు అడ్డుకునేందుకు ఔరంగజేబు (బాబీ డియోల్‌) సిద్ధమవుతాడు. ఈ ఇద్దరి మధ్య భారీ యాక్షన్ సీన్స్ ఉంటుంద‌ని అనుకునేలోపే సినిమా ముగుస్తుంది.ఇక ‘యుద్ధ భూమి’ అనే టైటిల్​తో ఎండ్ కార్డ్ పడ‌గా, అసలైన యుద్ధం అప్పుడే చూడాలి’ అంటూ కథకి ఫుల్​స్టాప్​ పెట్టారు. అంటే కోహినూర్ వెనక్కి తీసుకొచ్చే క్రమంలో ఔరంగజేబుతో వీరమల్లు చేసే పోరాటాలు, యాక్షన్ సన్నివేశాలు రెండో భాగంలో చూపించ‌బోతున్న‌ట్టు అర్థమ‌వుతుంది. దీంతో సెకండ్ పార్ట్ కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.. ఇప్ప‌టికే 30 శాతం షూటింగ్ కూడా పూర్తైన‌ట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లోనే సెకండ్ పార్ట్ మొద‌లు పెట్టినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. జ్యోతికృష్ణ దర్శకత్వం(Directer Jyothikrishna) వహించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో పాటు నిధి అగర్వాల్(Heroine Nidhi Agarwal), బాబీ డియోల్, అనసూయ, సునీల్, నాజర్, రఘుబాబు వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించారు.

Must Read
Related News