ePaper
More
    HomeసినిమాHari hara veera mallu | హరిహ‌ర వీర‌మ‌ల్లు కొత్త రిలీజ్ డేట్ వ‌చ్చేసింది.. ఈ...

    Hari hara veera mallu | హరిహ‌ర వీర‌మ‌ల్లు కొత్త రిలీజ్ డేట్ వ‌చ్చేసింది.. ఈ తేదీనైనా వ‌స్తుందా..?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hari hara veera mallu | పవర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (power star Pawan Kalyan), అందాల భామ నిధి అగర్వాల్ (nidhi agarwal) జంటగా నటిస్తోన్న హరిహర వీరమల్లు చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న మూవీలో తొలి భాగమైన ‘హర వీర మల్లు : పార్ట్ 1 స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ (hari hara veeramallu : part 1 sword vs spirit) మే 9న రిలీజ్ అవుతుంది అంటూ కాన్ఫిడెంట్‌గా చెప్పారు. కానీ ఈ డేట్‌కి రావ‌డం లేదు. మార్చి 28న వరల్డ్ వైడ్​గా రిలీజ్ చేస్తామని ప్రకటించిన నిర్మాతలు మే 9న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (official announcement) చేశారు. కానీ స‌మ‌యానికి షూటింగ్, ‘ రీ రికార్డింగ్, డబ్బింగ్, వీఎఫ్ఎక్స్ పనులు కాక‌పోవ‌డంతో వాయిదా వేశారు.

    Hari hara veera mallu | ఏ డేట్‌కి వ‌స్తుంది..

    ప్రజా పాలనలో బిజీ బిజీగా గ‌డిపేస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (power star pawan kalyan) ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు. ‘హరిహర వీరమల్లు’ పార్ట్ 1 షూటింగ్‌లో (harihara veera mallu part 1 shooting) ఈ నెల 4 నుంచి రెండు రోజుల పాటు పాల్గొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత ఏ.ఎం.రత్నం (producer AM.ratnam) తెలిపారు. సినిమా షూటింగ్ పూర్తైందని.. ఇక థియేటర్లలో రిలీజ్ కావడమే తరువాయి అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు బ్లాక్ బస్టర్ సాంగ్స్ (blockbuster songs), అదిరిపోయే ట్రైలర్ త్వరలోనే విడుదలవుతాయన్నారు. ఇప్పటికే రీ రికార్డింగ్, డబ్బింగ్, వీఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

    తాజా సమాచారం ప్రకారం.. ఈ భారీ చారిత్రాత్మక చిత్రం (historical film) 2025 జూన్ 12న థియేటర్లలో విడుదల కానుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. మే 6న అధికారికంగా షూటింగ్ వర్క్ పూర్తయింది. (officially shooting work completed). ఇక బుక్ మై షో (Book My show) సంస్థ తమ ప్లాట్‌ఫామ్‌లో “కమింగ్ సూన్ – జూన్ 12” అంటూ ప్రకటించి అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది. ఈ ప్రాజెక్టు 2020లో అధికారికంగా ప్రకటించబడినప్పటి నుంచి దాదాపు నాలుగు సంవత్సరాల సమయం గడిచింది. ఈ గ్యాప్‌లో కోవిడ్ మహమ్మారి, పవన్ కళ్యాణ్ రాజకీయ భాద్యతలు (covid pandemic and pawan kalyan’s political responsibilities) వంటి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. 2024 సెప్టెంబరులో విజయవాడలో సెట్ వేశాక మళ్లీ షూటింగ్ పునఃప్రారంభమై, 2025 మే 6న అధికారికంగా షూటింగ్ వర్క్ పూర్తయ్యింది. మ‌రి ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

    Latest articles

    Schools Holidays | ఈ జిల్లాల్లో నేడు, రేపు పాఠశాలలకు సెలవులు.. హైదరాబాద్​లో పరిస్థితి ఏమిటంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: Schools Holidays : భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ...

    Janahita Padayatra | 24 నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రెండో విడత జనహిత పాదయాత్ర.. ఈసారి ఎక్కడంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: Janahita Padayatra : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar...

    CM Revanth | ఆ ఆలయాలకు మహర్దశ.. టెంపుల్స్ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి..

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి (Telangana Chief Minister Revanth Reddy)...

    YS Jagan | జడ్పీటీసీ ఉప ఎన్నికల హైజాక్​.. ఏపీలో అరాచక పాలన : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్

    అక్షరటుడే, అమరావతి : YS Jagan | ఆంధ్రప్రదేశ్​(Andhra Pradesh)లో అరాచక పాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ...

    More like this