HomeUncategorizedHarihara Veera Mallu | హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు మళ్లీ వాయిదా ప‌డుతుందా.. ఈ సారి స‌మ‌స్య...

Harihara Veera Mallu | హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు మళ్లీ వాయిదా ప‌డుతుందా.. ఈ సారి స‌మ‌స్య ఇది..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harihara Veera Mallu | ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్(Power Star Pawan Kalyan) హీరోగా తెర‌కెక్కుతున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు Harihara veeramallu చిత్రం ఐదేళ్ల క్రితం సెట్స్ పైకి వెళ్లిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు వ‌స్తుందో ఎవ‌రికీ అర్ధం కావ‌డం లేదు. వాయిదాల మీద వాయిదాల ప‌డుతూ వ‌స్తున్న ఈ చిత్రం జూన్ 12న రిలీజ్ కానుందంటూ ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. కానీ ఆ డేట్‌కి రావ‌డం కూడా క‌ష్టంగానే మారింది. జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని తెలుగు రాష్ట్రాల సినీ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. అద్దె ప్రాతిపాదికన సినిమాలను ప్రదర్శించలేమని, పర్సంటెజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్లు తీర్మానం చేశారు.

Harihara Veera Mallu | మ‌ళ్లీ వాయిదా..

జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో మళ్లీ ‘హరి హర వీరమల్లు’ సినిమా వాయిదా పడే అవకాశాలు కనపడుతున్నాయి. జూన్‌లో హరిహర వీరమల్లుతో పాటు ధగ్ లైఫ్, కన్నప్ప, కుబేర్, కింగ్డమ్ వంటి సినిమాలు విడుదల కావాల్సి ఉన్నా కూడా జూన్ 1 నుంచి సింగిల్‌ స్క్రీన్‌ సినిమా థియేటర్లు బంద్ అవ‌డం వ‌ల‌న ఆ ప్రభావం వీటిపై కూడా పడనుంది. చూడాలి మ‌రి ఈ సారి ఏం జ‌రుగుతుందో. ఇక హరిహర వీరమల్లు సినిమా మొదట 2022 జనవరిలో సంక్రాంతికి Pongal వస్తుందని ప్ర‌క‌టించారు. ఆ తర్వాత 2022 ఏప్రిల్ 29 సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. కానీ అప్పటికి షూటింగ్(Shooting) పూర్తి కాక‌పోవ‌డంతో వాయిదా ప‌డింది.

అనంత‌రం 2022 అక్టోబర్ 5న చిత్రం రిలీజ్ అవుతుందన్నారు. అది కూడా వాయిదా పడింది. ఆ తర్వాత 2023 జనవరి సంక్రాంతికి వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించారు. కానీ అప్పుడు వాయిదా ప‌డింది. 30 మార్చ్ 2023 అని రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన అప్పుడు రాలేదు. 2023 దసరాకి వస్తుందన్నారు రాలేదు. 2024 సమ్మర్​కు వస్తుంది అని చెప్పిన అప్పుడు రాలేదు. ఇక 2024 డిసెంబర్​లో వస్తుంది అని హడావిడి చేసి షూటింగ్ స్పీడ్ పెంచిన కూడా రిలీజ్ కాలేదు. 26 జనవరి 2025న ప‌క్కా అని అన్నారు కానీ రిలీజ్ అవ్వలేదు. 28 మార్చ్ 2025 రిలీజ్ ఖాయం అంటూ తెగ హ‌డావిడి చేశారు. కానీ గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ ప‌నులు VFX పూర్తి కాక‌పోవ‌డంతో పోస్ట్ పోన్ చేసి మే 9న త‌ప్ప‌క విడుద‌ల చేస్తామ‌న్నారు. అది కూడా వాయిదా పడి జూన్ 12కి వెళ్లింది. ఈ సారి ఏం జ‌రుగుతుందో చూడాలి.