అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IPL 2025 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ virat kohli ఫార్మూలాతోనే వరుస విజయాలు సాధిస్తున్నామని ముంబై ఇండియన్స్ MI కెప్టెన్ హార్దిక్ పాండ్యా Hardik Pandya తెలిపాడు. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు బ్యాటింగ్ batting, బౌలింగ్ bowling చేసి ఆశించిన ఫలితాలు అందుకుంటున్నామని చెప్పాడు. ఐపీఎల్ IPL 2025 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ RRతో గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ MI 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఇది ముంబై ఇండియన్స్‌కు వరుసగా 6వ విజయం.
IPL 2025 | భాగస్వామ్యాలు ముఖ్యం
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన హార్దిక్ పాండ్యా .. టీ20 క్రికెట్‌ను ఉద్దేశించి కోహ్లీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించాడు. టీ20 అంటే దంచికొట్టడమే కాదని, పరిస్థితులకు తగ్గట్లు సింగిల్స్, డబుల్స్ తీయడం కూడా ముఖ్యమేనని, బలమైన భాగస్వామ్యాలు నెలకొల్పడం కీలకమని కోహ్లీ తెలిపాడు. తాము కూడా పరిస్థితులకు తగ్గట్లు ఆడుతూ.. భాగస్వామ్యాలు నెలకొల్పి విజయాలు అందుకుంటున్నామని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
‘ఈ మ్యాచ్‌లో మా బ్యాటింగ్ అద్భుతం. బౌలింగ్‌లోనూ సమష్టిగా రాణించాం. మేం మా లక్ష్యానికి అదనంగా 15 పరుగులు చేయాల్సింది. నేను, సూర్య surya సరైన షాట్స్ ఆడాలని మాట్లాడుకున్నాం. కొద్దిలో మేం అనుకున్న లక్ష్యానికి 15 పరుగులు తక్కువ చేశాం. గ్యాప్‌లో షాట్స్ ఆడితేనే వాటికి అసలైన విలువ ఉంటుంది. రోహిత్ rohit, ర్యాన్ రికెల్టన్ అలానే ఆడారు. ముఖ్యంగా రికెల్టన్ దూకుడుగా ఆడుతూ బౌండరీలు బాదాడు. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేశారు. మా ఆటగాళ్లు భాగస్వామ్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది మాకు కలిసొచ్చే అంశం. ఈ మ్యాచ్‌లో మా బ్యాటింగ్ సాగిన తీరు అసలు సిసలైన బ్యాట్స్‌మెన్‌షిప్. మా జట్టు అంతా ఇలానే ఆడాలనుకుంటుంది. మా బౌలర్ల ప్రదర్శన అసాధారణం. ఏ ఒక్కరు తక్కువ కాదు. అందరూ సమష్టిగా చెలరేగుతున్నారు.’అని హార్దిక్ పాండ్యా తెలిపాడు.