అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hardik Pandya | టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లోకి ఎక్కాడు. తాజాగా ముంబై ఎయిర్‌పోర్టు(Mumbai Airport)లో హార్దిక్, తన రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మతో కలిసి కనిపించారు.
ఇద్దరూ క్లోజ్‌గా దిగిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వేగంగా వైరల్ అవుతున్నాయి.దీంతో వీరిద్దరి మధ్య రిలేషన్‌షిప్ ఉందన్న ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి. గత ఏడాది హార్దిక్ తన భార్య నతాషా స్టాంకోవిక్‌కు విడాకులు ఇచ్చినట్టు ప్రచారం జరిగిన తర్వాత నుంచి ఆయన మహికా శర్మ(Mahika Sharma)తో డేటింగ్ చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అప్పటినుంచి వీరిద్దరూ పలు సందర్భాల్లో మీడియా కంటపడినా… ఏదీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే, తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో వీరిద్దరిని అలా చూసాక వీరిద్దరి మధ్య నిజంగానే బాండింగ్ ఉందని నెటిజన్లు ఫిక్స్ అయ్యారు.
Hardik Pandya | మహికా శర్మ ఎవరు?
మహికా శర్మ ఓ ప్రొఫెషనల్ మోడల్, యాక్ట్రెస్. ఫైనాన్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసిన తర్వాత మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన మహికా వివో, యూనిక్లో, తనిష్క్ లాంటి పాపులర్ బ్రాండ్ల యాడ్ క్యాంపెయిన్‌ల్లో కనిపించారు. ఆమె మోడల్ ఆఫ్ ది ఇయర్ (న్యూ ఏజ్) అవార్డు కూడా గెలుచుకుంది. మనీష్ మల్హోత్రా, తరుణ్ తహిలియాని, అనిత డోంగ్రే, అమిత్ అగర్వాల్ వంటి ప్రముఖ డిజైనర్లకు ర్యాంప్ వాక్ చేసిన మహికా.. దేశవ్యాప్తంగా ఫ్యాషన్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. గతేడాది ఓ ఫ్యాషన్ షోలో కంటినొప్పితో బాధపడుతుండగా కూడా ర్యాంప్ వాక్‌ను కంటిన్యూ చేయడం, షో మధ్యలో హైహీల్స్ విరిగినా ఆటంకం లేకుండా వాక్ పూర్తి చేయడం ద్వారా ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. తన ధైర్యం, డెడికేషన్‌తో సోషల్ మీడియాలో మెప్పించిన ఈ మోడల్.. ఇప్పుడు హార్దిక్ పాండ్యా(Hardik Pandya)తో రిలేషన్ కారణంగా మరింత హాట్ టాపిక్‌గా మారారు.
గతంలో రెడ్డిట్‌లో మహికా షేర్ చేసిన ఓ సెల్ఫీలో హార్దిక్ ఉన్నట్టు నెటిజన్లు గుర్తించి, అప్పట్లోనూ వీరి మధ్య రిలేషన్‌షిప్ ఉందంటూ గాసిప్స్ వచ్చాయి. అలాగే, సింగర్ జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేసినట్టు హార్దిక్‌కి సంబంధించిన పుకార్లు గతంలో వచ్చాయి. అయితే వాటన్నింటికంటే మహికాతో సంబంధం ఎక్కువకాలం నుండి కొనసాగుతుందని ఊహగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ జంటపై ఉన్న ఆసక్తి మరింత పెరగడంతో, “హార్దిక్ – మహికా పెళ్లి కూడా ఫిక్సా?” అంటూ నెటిజన్లు చర్చ మొదలెట్టారు. కానీ ఇప్పటివరకు వీరిద్దరిలో ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. తాము కేవలం స్నేహితులమా? లేక ప్రేమలో ఉన్నారా? అన్న ప్రశ్నకు సమాధానం ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది.