అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hardik Pandya | టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మరోసారి క్రికెట్ కంటే అతని వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచాడు. మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్‌తో (Natasha Stankovic) విడాకుల తర్వాత, హార్దిక్ తాజాగా మోడల్ మహీక శర్మతో గడిపిన బీచ్ వెకేషన్ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో మహీకతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసిన హార్దిక్, తమ సంబంధాన్ని పరోక్షంగా ఇన్‌స్టా వేదికగా కన్‌ఫాం చేసినట్టు అభిమానులు భావిస్తున్నారు. బీచ్ వెకేషన్‌లో ఇద్దరూ సరదాగా గడిపిన సందర్భాల్లో తీసిన ఫోటోలు నెట్టింట్లో బాగా పాపులర్ అయ్యాయి.
Hardik Pandya | కన్‌ఫాం చేసినట్టేనా..
ఒక ఫోటోలో హార్దిక్ మహీక భుజంపై చేయి వేసి చాలా రిలాక్స్‌గా కనిపించగా, మరో ఫోటోలో వీరిద్దరూ డేట్ నైట్‌కు సిద్ధమైన లుక్‌లో కనిపించారు. హార్దిక్ ఓవర్‌సైజ్ షర్ట్, జీన్స్‌లో కనిపించగా, మహీక బ్లాక్ స్లీక్ డ్రెస్‌లో స్టన్నింగ్‌గా మెరిసింది. ఫ్యాన్స్ కామెంట్ల ప్రకారం వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోనున్నారని, పర్‌ఫెక్ట్ కెమిస్ట్రీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మహీక శర్మ (Mahieka Sharma) కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో హార్దిక్‌తో ఉన్న ఫోటోను షేర్ చేయడం, దానిపై పింక్ బో, కేక్ ఎమోజీలతో హింట్స్ ఇవ్వడం కూడా నెటిజన్ల ఉత్కంఠను రెట్టింపు చేసింది. ఇకపోతే, ఈ రిలేషన్‌పై ఇద్దరూ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు గానీ, సోషల్ మీడియా స్టోరీలు మాత్రం వారిద్దరి రిలేషన్‌ని కన్‌ఫాం చేస్తున్నాయి..
ఇదిలా ఉండగా, హార్దిక్ పాండ్యా గతంలో బాలీవుడ్ నటి (Bollywood actress) ఈషా గుప్తాతో కూడా రిలేషన్‌లో ఉన్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఈషా క్లారిటీ ఇచ్చింది “మా మధ్య రిలేషన్ బలపడలేదు. కేవలం కొన్ని నెలలపాటు కాంటాక్ట్‌లో ఉన్నాం. అది డేటింగ్ కాదు అని తెలిపింది. ఇక 2020లో నటాషా స్టాంకోవిచ్ ని వివాహం చేసుకున్న హార్దిక్, 2024 జూలైలో విడాకులు తీసుకున్నాడు. అయితే ఇద్దరూ తమ కుమారుడు అగస్త్య కోసం కో-పెరెంటింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహీకతో హార్దిక్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడంపై అభిమానుల ఆసక్తి పెరిగింది. మహీక శర్మ మోడలింగ్ ప్రపంచంలో విశేషంగా గుర్తింపు తెచ్చుకున్న మోడల్.