IPL 2025 | హార్ధిక్ పాండ్యా కంటి గాయం వెన‌క సీక్రెట్ ఔట్.. ఏడు కుట్లు ప‌డ్డా కూడా ఆడాడా..!
IPL 2025 | హార్ధిక్ పాండ్యా కంటి గాయం వెన‌క సీక్రెట్ ఔట్.. ఏడు కుట్లు ప‌డ్డా కూడా ఆడాడా..!

అక్షరటుడే, వెబ్​డెస్క్:IPL 2025 | ఈ ఏడాది ఐపీఎల్ హోరా హోరీగా సాగుతుంది. ప్లే ఆఫ్ లో ఆడే జ‌ట్లు ఏవి, ఏ జట్టు ఫైన‌ల్ చేరుతుంది, ఏ జ‌ట్టు క‌ప్ కొడుతుంది అనేది చెప్ప‌డం కూడా కాస్త క‌ష్టంగానే మారింది.అయితే ఈ సీజ‌న్‌లో ముంబై ఇండియన్స్ Mumbai indians జ‌ట్టు మొద‌ట్లో కాస్త నిరాశ‌ప‌రిచిన ఇప్పుడు వ‌రుస విజ‌యాలతో దూసుకుపోతుంది. తొలి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు ఓటములతో నిరాశపరిచిన ముంబై జ‌ట్టు ఆ తర్వాత అనూహ్యంగా పోటీలోకి వచ్చి ఇప్పుడు ఎదురులేని జట్టుగా నిలిచింది. తాజాగా ఆర్ఆర్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఘ‌న విజ‌యం సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానానికి చేరింది.

IPL 2025 | గాయం వెన‌క కార‌ణం ఇదా..

వరల్డ్ టాప్ క్లాస్ బౌలర్లంతా ఈ మ్యాచ్‌లో సత్తా చాటడంతో రాజస్థాన్ రాయల్స్ Rajastan Royals 117 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో ముంబై ఇండియన్స్ Mumbai indians 100 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచు విజయంలో కీలకంగా వ్యవహరించిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య Hardik Pandya అసలైన నాయకుడని నిరూపించుకున్నాడు. త‌న ఎడ‌మ క‌న్నుపైన దెబ్బ తగిలి ఏడు కుట్లు ప‌డ్డా కూడా ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌కుండా బ‌రిలోకి దిగాడు. టాస్ వేసే స‌మ‌యంలో ఆయ‌న ఎడమ కన్నుపై ఓ వైట్ టేప్ వేసుకుని, కంటికి కళ్లజోడు పెట్టుకుని వ‌చ్చాడు. అప్పుడు కార‌ణం ఏంట‌నేది ఎవ‌రికి అర్ధం కాలేదు.

కాని త‌ర్వాత అస‌లు విష‌యం అర్ధమైంది. ట్రైనింగ్ సమయంలో లెఫ్ట్ కన్నుపై భాగంలో గాయమై ఏడు కుట్లు పడ్డాయి. అయినా కూడా అతడు విశ్రాంతి తీసుకోకుండా తాజా మ్యాచ్ ఆడాడు. కెప్టెన్ కమిట్ మెంట్ చూపించాడు. ఈ మ్యాచులో హార్దిక్‌ రెచ్చిపోయి ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ Surya kumar yadav తో కలిసి అలవోకగా షాట్లు బాదుతూ మూడో వికెట్‌కు 44 బంతుల్లోనే 94 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మొత్తంగా హార్దిక్.. 23 బంతుల్లో 6×4, 1×6 సాయంతో 48 నాటౌట్‌ పరుగులు చేశాడు. బంతితోనూ (1/2) రాణించాడు హార్దిక్. ఇక పేలవ ప్రదర్శనతో ఎనిమిదో ఓటమిని అందుకున్న రాజస్థాన్‌ రాయల్స్ ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది.