అక్షరటుడే, వెబ్‌డెస్క్: IPL 2025 | ఐపీఎల్ 2025లో (IPL 2025) ఫైనల్‌లో తలపడే జట్లపై క్లారిటీ వచ్చింది. గత రాత్రి జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో (Qualifier 2 match) ముంబైపై పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించి ఫైనల్‌కి వెళ్లింది. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)(41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 87 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) విజయంలో కీలక పాత్ర పోషించాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi Stadium) జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (Punjab Kings captain Shreyas Iyer) అద్భుతమైన కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. 2014 తర్వాత పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ఫైనల్‌కు చేరడం ఇది తొలిసారి కావడం విశేషం. ఐపీఎల్ 2025 సీజన్‌లో (IPL 2025 season) ముంబై ఇండియన్స్ పోరాటం ముగిసింది.
IPL 2025 | గ్రేట్ కెప్టెన్సీ..
ఈ ఓటమితో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేకపోయాడు. భారీ సిక్సర్‌తో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) మ్యాచ్ ముగించిన వెంటనే మైదానంలో కుప్పకూలిన హార్దిక్ పాండ్యా (Hardik Pandya) భావోద్వేగానికి గురయ్యాడు. తన కన్నీళ్లను చేతులతో దాచుకున్నాడు. టైటిల్ గెలిచే అవకాశం రెండడుగుల దూరంలో చేజారడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. అయితే పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మూడు వేర్వేరు జట్లను ఫైనల్ చేర్చిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు (Delhi Capitals) సారథ్యం వహించిన శ్రేయస్ అయ్యర్.. ఆ జట్టును టాప్ ప్లేస్‌లో నిలిపడమే కాకుండా ఫైనల్‌కు తీసుకెళ్లాడు. గతేడాది కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) కెప్టెన్‌గా ఆ జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లడమే కాకుండా టైటిల్ కూడా అందించాడు. తాజాగా పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్ చేర్చాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మరే కెప్టెన్ కూడా ఈ ఫీట్ సాధించలేదు.
18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ ఫైనల్ చేరడం ఇది రెండోసారి మాత్రమే. 2014లో ఆ జట్టు ఫైనల్ (final) చేరినా కేకేఆర్ చేతిలో ఓటమిపాలైంది. తాజా మ్యాచ్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ (Mumbai Indians) నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ముంబై బ్యాటింగ్‌లో తిలక్ వర్మ (Tilak Verma) (44), సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) (44) కీలక పరుగులు చేయగా, చివర్లో నమన్ ధీర్ (18 బంతుల్లో 37) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ స్కోరు అందించాడు. అనంతరం 204 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) అసాధారణ ప్రదర్శనతో 19 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శ్రేయాస్ అయ్యర్ కేవలం 41 బంతుల్లో 5 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో అజేయంగా 87 పరుగులు చేసి మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. ఇంగ్లిస్ (21 బంతుల్లో 38), నేహాల్ వధేరా (29 బంతుల్లో 48) కూడా కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి అయ్యర్‌కు మద్దతు ఇచ్చారు. ఈ సారి ఏ టీం గెలిచినా కూడా చరిత్రే అవుతుంది. ఆర్సీబీ, పంజాబ్ (RCB and Punjab) ఇంత వరకు టైటిల్ దక్కించుకోలేదు.