అక్షరటుడే, మెండోరా: Group-1 job | మండలానికి చెందిన దోనుపాల కిరణ్ (Donupala Kiran) మొదటి ప్రయత్నంలోనే గ్రూప్–1లో ఉద్యోగం సాధించాడు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లోని శిల్పకళావేదికలో సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) చేతుల మీదుగా ఆయన నియామక పత్రం అందుకున్నాడు.
Group-1 job | అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా..
దోనుపాల కిరణ్ గ్రూప్–1లో (Group-1) మొదటి ప్రయత్నంలోనే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా ఉద్యోగం సాధించాడు. ప్రణాళికాబద్ధంగా.. సీనియర్ల సలహాలతో సమయపాలన పాటిస్తూ చదివినందుకే తాను మొదటి ప్రయత్నంలో ఉద్యోగం సాధించానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, బంధువులు స్నేహితులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.