ePaper
More
    Homeక్రీడలుHarbhajan Singh | క్రికెట్ ఫ్యాన్స్‌పై హర్భజన్ సింగ్ అనుచిత వ్యాఖ్యలు!

    Harbhajan Singh | క్రికెట్ ఫ్యాన్స్‌పై హర్భజన్ సింగ్ అనుచిత వ్యాఖ్యలు!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Harbhajan Singh | క్రికెటర్ల అభిమానులపై టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి (mahendra singh dhoni) మాత్రమే నిజమైన ఫ్యాన్స్ ఉన్నారని, మిగతా ఆటగాళ్ల అభిమానుల అంతా డబ్బులు తీసుకొని మద్దతు తెలిపేవారని వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్స్‌పై సోషల్ మీడియా (social media) వేదికగా దుమారం రేగుతోంది. స్టార్ స్పోర్ట్స్ (star sports) చర్చా కార్యక్రమంలో పాల్గొన్న హర్భజన్ సింగ్.. 43 ఏళ్ల వయసులో ధోనీ ఐపీఎల్ (IPL) ఎందుకు ఆడుతున్నాడో వివరించాడు. ఈ క్రమంలో ఇతర ఆటగాళ్ల ఫ్యాన్స్‌పై నోరు జారాడు.

    ‘ధోనీ తాను ఆడాలనుకున్నన్ని రోజులు ఆడగలడు. అతను నా జట్టులో ఉంటే నేను తప్పించే వాడిని. కానీ అభిమానులు.. ధోనీ (dhoni) ఇంకొన్నాళ్లు ఆడాలని కోరుకుంటున్నారు. ధోనీకి ఫ్యాన్స్ రియల్ (dhoni fans real). మిగతా ఆటగాళ్ల ఫ్యాన్స్ అంతా పెయిడ్. డబ్బులు తీసుకొని సోషల్ మీడియా (social media) వేదికగా ఆటగాళ్లకు మద్దతు తెలుపుతారు. అలాంటి అభిమానుల గురించి మాట్లాడటం అనవసరం. వారి గురించి మాట్లాడితే ఈ చర్చ పక్కదారి పడుతుంది.’ అని హర్భజన్ సింగ్ (harbhajan singh) చెప్పుకొచ్చాడు. పక్కనే ఉన్న ఆకాశ్ చోప్రా (akash chopra) ఇంత నిజాయితీగా మాట్లాడితే సమస్యలు ఎదురువుతాయని చెప్పాడు. వెంటనే హర్భజన్ సింగ్ ఎవరైనా నిజాయితీగానే ఉండాలని బదులిచ్చాడు.

    హర్భజ్ సింగ్ వ్యాఖ్యలు సోషల్ మీడియా (social media) వేదికగా వైరల్ కావడంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫ్యాన్స్ (virat kohli and rohit sharma fans).. అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎవరూ డబ్బులు చెల్లించడం లేదని, తాము కూడా నిజమైన అభిమానులమని కామెంట్ చేస్తున్నారు. కొందరైతే డబ్బులు ఎక్కడ ఇస్తున్నారో చెప్పాలని హర్భజన్ సింగ్‌ను నిలదీస్తున్నారు. కోహ్లీ, రోహిత్ (kohli and rohit) అభిమానుల ప్రేమ హర్భజన్ సింగ్‌కు కనబడటం లేదని మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా హర్భజన్ సింగ్‌పై జుగుప్సాకరమైన రీతిలో ట్రోల్ చేస్తున్నారు.

    Latest articles

    Railway Passengers | నత్తనడకన మనోహరాబాద్​–కొత్తపల్లి రైల్వేలైన్​ పనులు.. భారీగా పెరిగిన అంచనా వ్యయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Passengers | మనోహరాబాద్​–కొత్తపల్లి రైల్వే లైన్​ (Manoharabad–Kothapalli Railway Line) పనులు నత్తనడకన...

    Superstar Rajinikanth | కూలీ ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌లో ర‌జ‌నీకాంత్ పాదాల‌పై ప‌డ్డ స్టార్ హీరో.. అంతా షాక్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Superstar Rajinikanth | సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఈ వ‌య‌స్సులోను ఉత్సాహంగా సినిమాలు చేస్తూ...

    Assembly Speaker | వారి భ‌విత‌వ్య‌మేమిటో?.. ఆందోళ‌న‌లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Assembly Speaker | తెలంగాణ‌లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఆందోళ‌న క‌నిపిస్తోంది. ప‌ద‌వులు ఉంటాయో...

    Operation Akhal | జమ్మూ కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు టెర్రరిస్టుల హతం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Akhal | జమ్మూ కశ్మీర్​ (Jammu and Kashmir)లో భారీ ఎన్​కౌంటర్ (Encounter)​...

    More like this