అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sajjanar | ఆర్టీసీ ఎండీ RTC MD సజ్జనార్ Sajjanar కార్మికులను వేధించడం ఆపాలని ఎస్‌డబ్ల్యూయూ swu ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి అన్నారు. సజ్జనార్‌పై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ట్విట్టర్లో కంప్లైంట్ వస్తే ఉద్యోగులను సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. కార్మికుల సంక్షేమం పట్టించుకోని మీరు ఎందుకు ఉన్నట్లు అని నిలదీశారు. సజ్జనార్‌కు వారం రోజులు టైమ్ ఇస్తున్నామని, కార్మికులపై వేధింపులు, కక్ష సాధింపులకు ఫుల్ స్టాప్ పెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కాగా సజ్జనార్‌పై గతంలో 400 మంది కార్మికులు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆయన అవినీతి పరుడని పలువురు కార్మికులు మార్చిలో ప్రధాని, సీఎం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పలువురు కార్మికులు లేఖ రాశారు. చిన్న చిన్న పొరపాట్లకు కార్మికులను ఉద్యోగంలోని నుంచి తొలగించారని వారు ఆరోపించారు.
Sajjanar | కార్మికులపై వేధింపులు ఆపాలి.. సజ్జనార్‌పై సంచలన ఆరోపణలు
3
previous post