31
Constitution Day | వ్యాస రచన పోటీలు
అక్షరటుడే, ఇందూరు: Constitution Day | భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ నగర శివారు బోర్గాం(పీ) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
నవంబరు 26 రాజ్యాంగ దినోత్సవ ప్రాధాన్యాన్ని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు శ్రీనివాస్ వివరించారు. అనంతరం విద్యార్థులకే రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు.
Constitution Day | వ్యాస రచన పోటీలు
విద్యార్థులకు క్విజ్, వ్యాస రచన పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శంకర్, ఉపాధ్యాయులు రాజు, ఉషా కిరణ్ రాజు, మస్రత్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.