Nandamuri Bala Krishna
Nandamuri Bala Krishna | నంద‌మూరి న‌ట‌సింహం, ప‌ద్మ భూష‌ణ్ బాల‌య్య‌కి బ‌ర్త్ డే విషెస్.. ఆ రికార్డులు బాల‌య్య‌కే సొంతం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nandamuri Bala Krishna | నట‌న‌లో, సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్న నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ఈ రోజు 65వ ప‌డిలోకి అడుగుపెట్టారు. ఈ సంద్భ‌రంగా బాల‌య్య‌కి సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ యాక్షన్ సినిమాలకు బాలయ్య బాబు (Bala Krishna) కేరాఫ్ అడ్రస్. 1974 నాటి తాతమ్మ కల సినిమా నుంచి 2025లో రిలీజ్ అయిన డాకు మహారాజ్ మూవీ దాకా ఎన్నో ఎత్తులు ప‌ల్లాలు చూశాం. తెలుగు సినీ పరిశ్రమలో మాస్ యాక్షన్ సినిమాలకు బాలకృష్ణ కేరాఫ్ అడ్రస్‌. పౌరాణిక, సాంఘిక, జానపద, సైన్స్‌ఫిక్షన్‌ జానర్లనూ ఆయన టచ్ చేశారు.

Nandamuri Bala Krishna | బాల‌య్య‌కే సొంతం..

ఇప్పటివరకు బాల‌య్య 109 సినిమాల్లో నటించి ఎన్నో రికార్డులను నెలకొల్పారు. బాక్సాఫీసును షేక్ చేయాలంటే బాలయ్య బాబు సినిమా రావాల్సిందే అనే విధంగా తన క్రేజ్ మార్చుకున్నాడు. దాదాపు 52 ఏళ్లుగా తెలుగు సినీరంగంలో తనదైన శైలిలో ప్రత్యేక ముద్రవేసుకున్నారు బాల‌య్య‌. 17 సినిమాల్లో డ్యూయల్ రోల్‌లో నటించిన రికార్డు బాలయ్య ఒక్కరికే ఉంది. అంతేకాకుండా చిత్ర పరిశ్రమకు, సమాజానికి ఆయన చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్​(Padma Bhushan)తో బాల‌య్య‌ని ఘ‌నంగా సత్కరించింది. న‌టుడిగానే కాకుండా రాజకీయాల్లోనూ ఆయన తన సత్తా ఏంటో చాటుకుంటున్నారు. దాదాపు మూడు సార్లు(MLA)గా గెలిచి.. తనకు పోటీ లేదని నిరూపించుకున్నారు.

2014 నుంచి హిందూపూర్ అసెంబ్లీ(Hindupur Assembly) స్థానం నుంచి ఎమ్మెల్యేగా వరుసగా మూడుసార్లు గెలిచారు. ఒకవైపు జనం మెచ్చిన నటుడిగా.. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా ఆయన దూసుకుపోతుండడం విశేషం. ఇంకోవైపు పేద ప్రజలకు తోడుగా నిలుస్తున్నారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్‌(Basavatarakam Cancer Hospital Chairman)గానూ సేవలందిస్తున్నారు. బాల‌య్య వ‌య‌స్సు 65 ఏళ్లయిన ఇప్పటికీ కుర్ర హీరోల‌కు పోటీ ఇస్తున్నారు. న‌టుడిగానే కాకుండా హోస్ట్‌గాను అద‌ర‌గొడుతున్నారు. బాల‌య్య హోస్ట్ చేసిన అన్‌స్టాప‌బుల్ కూడా అనేక రికార్డులు కొల్ల‌గొట్టింది. బాల‌య్య బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. తెలుగు సినీనటులు, హిందూపురం శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్(Nandamuri Balakrishna)కు జన్మదిన శుభాకాంక్షలు. వెండి తెర కథానాయకుడిగా కోట్లాది అభిమానులను పొందిన మీరు.. నిండు నూరేళ్లూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నానని పోస్ట్‌లో రాసుకొచ్చారు. బాల‌య్య త్వ‌ర‌లో ‘అఖండ-2’, ‘జైలర్ -2’ సినిమాల్లో న‌టించి అల‌రించ‌నున్నారు.