ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిShabbir Ali | ప్రభుత్వ పథకాలతో ప్రజల కళ్లలో ఆనందం : షబ్బీర్​అలీ

    Shabbir Ali | ప్రభుత్వ పథకాలతో ప్రజల కళ్లలో ఆనందం : షబ్బీర్​అలీ

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | గ్రామాల్లో తిరుగుతుంటే ప్రజల కళ్లలో ఆనందం కనిపిస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలేనని పేర్కొన్నారు.

    మాచారెడ్డి (Machareddy) మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. సర్దపూర్ తండాలో రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించనున్న గ్రామపంచాయతీ భవనం, నెమలిగుట్ట తండాలో (Nemali Gutta Thanda) రూ.12 లక్షలతో అంగన్​వాడీ భవనం, మర్రి తండాలో రూ.20 లక్షలతో నిర్మించనున్న జీపీ భవనానికి శంకుస్థాపన నిర్వహించారు.

    అలాగే గుంటి తండాలో రూ.20 లక్షలతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవనం, వడ్డెర కాలనీలో రూ.20 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనం, వెనుక తండాలో రూ.12 లక్షలతో నిర్మించనున్న అంగన్​వాడీ భవనం, పాల్వంచ మండలం వాడి గ్రామంలో రూ. 20 లక్షలతో నిర్మించనున్న జీపీ భవన నిర్మాణాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

    Shabbir Ali | ఇందిరమ్మ ఇళ్లకు మంజూరు పత్రాలు..

    ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, ఆహార భద్రత కార్డులను షబ్బీర్​ అలీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో (BRS Government) ప్రజలు తీవ్ర మనోవేదనకు గురయ్యారన్నారు. సమస్యలు చెప్పుకుందామంటే నాయకులు గ్రామాల్లోకి వచ్చేవారు కాదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్కరేషన్ కార్డు (Ration Card) ఇవ్వలేదని.. పేదలకు ఇల్లు రాలేదని, బీఆర్ఎస్ నాయకులు మాత్రం లక్షాధికారులయ్యారని ఆరోపించారు.

    Shabbir Ali | కాంగ్రెస్​ ప్రభుత్వం పేదల ప్రభుత్వం..

    కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వమని, పేదల అభ్యున్నతికి కృషి చేస్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి పేదల ప్రజల పక్షాన పోరాటం చేస్తూ వారికోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని స్పష్టం చేశారు.

    Shabbir Ali | 9 రోజుల్లో రూ.9వేల కోట్లు..

    తొమ్మిది రోజుల్లో రూ.9వేల కోట్లు రైతు భరోసా అందించి రైతులను ఆదుకున్నామని షబ్బీర్​అలీ స్పష్టం చేశారు. నిరుపేదలకు నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను (Indiramma Housing Scheme) మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు పేదల కోసం ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నర్సింగరావు, పల్లె రమేష్ గౌడ్, గణేష్ నాయక్, బ్రహ్మానందరెడ్డి, భిక్కనూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాజు, సుతారి రమేష్, ఇంద్ర సేనా రెడ్డి, స్వామి, నరసింహారెడ్డి, రాజు నాయక్, కొమురయ్య, లక్ష్మీరాజ్యం, చంద్ర నాయక్, దేవి సింగ్, రాము పాల్గొన్నారు.

    Latest articles

    Hyderabad | హైదరాబాద్​లో ఐదు రోజుల పాటు ట్రాఫిక్​ ఆంక్షలు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | వినాయక చవితి (Ganesha Chavithi) వచ్చిందంటే హైదరాబాద్ నగరంలో (Hyderabad City)...

    Naleshwar | నాళేశ్వర్​లో భక్తిశ్రద్ధలతో ఎడ్ల పొలాల అమావాస్య

    అక్షరటుడే, నవీపేట్​: Naleshwar | నవీపేట్ (Navipet)​ మండలంలోని నాళేశ్వర్​లో శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఎడ్లపొలాల అమావాస్యను (Yedla Polala...

    Amaravati | అమరావతిలో భారీ క్రికెట్​ స్టేడియం.. 40 ఎకరాలు కావాలని కోరిన ఏసీఏ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Amaravati | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ రాజధాని అమరావతి (Amaravati)లో భారీ క్రికెట్​ స్టేడియం నిర్మించాలని...

    Gandhari | గాంధారిలో జోరుగా మొరం అక్రమ దందా..! రాత్రికి రాత్రే గుట్టలను తవ్వేస్తున్న వైనం..

    అక్షరటుడే, గాంధారి: Gandhari | గాంధారి మండలంలో మొరం అక్రమ దందా (Moram Dandha) జోరుగా సాగుతోంది. కొందరు...

    More like this