ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKaleshweram | రైతుల కళ్లలో ఆనందమే లక్ష్యం

    Kaleshweram | రైతుల కళ్లలో ఆనందమే లక్ష్యం

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: kaleshweram | రైతుల కళ్లలో ఆనందం చూడడమే ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(government advoiser shabbir ali) లక్ష్యమని డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు అన్నారు. కాళేశ్వరం 22 ప్యాకేజీ పనులకు (kaleshweram 22 packej works) రూ. 23.15 కోట్లు మంజూరు చేయించడంతో జిల్లా కేంద్రంలోని ప్రాణహిత చేవెళ్ల పైలాన్ వద్ద షబ్బీర్ అలీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కైలాస్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. షబ్బీర్ అలీ రైతుల (farmers) పక్షపాతి అన్నారు. ప్రాణహిత చేవెళ్ల (కాళేశ్వరం ) 20, 21, 22 ప్యాకేజీ ద్వారా జిల్లాలో సాగు నీరందించేందుకు ఎంతో కృషి చేస్తున్నారన్నారు.

    ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లా రైతులకు (farmers) శాశ్వతంగా సాగు నీటి పరిష్కారం లభిస్తుందన్నారు. జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని వివరించారు. ఆ ఘనత ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకే (shabbir ali) దక్కుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్​ చంద్రకాంత్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు లింగారెడ్డి, భిక్కనూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్​ రాజు, కామారెడ్డి మార్కెట్ కమిటీ ఛైర్మన్​ లక్ష్మి రాజా గౌడ్, బద్దం ఇంద్రకరణ్ రెడ్డి. కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు పండ్లరాజు, మండలాధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి, ఎన్ఎస్​యూఐ జిల్లా అధ్యక్షుడు ఐరేనీ సందీప్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సుదర్శన్, యూత్ కాంగ్రెస్ నేత గుడుగుల శ్రీనివాస్ పాల్గొన్నారు.

    More like this

    National Highway | అదుపు తప్పిన టిప్పర్.. తప్పిన భారీ ప్రమాదం

    అక్షరటుడే, డిచ్​పల్లి: National Highway | మండలంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది....

    CMRF Checks | బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

    అక్షరటుడే, ఆర్మూర్ : CMRF Checks | ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామానికి(Ramchandrapalli Village) చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న...

    Maoists | మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా తిరుపతి నియామకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా జగిత్యాల...