Homeజిల్లాలునిజామాబాద్​Hanuman Chalisa | భక్తిశ్రద్ధలతో హనుమాన్​ చాలీసా పారాయణం

Hanuman Chalisa | భక్తిశ్రద్ధలతో హనుమాన్​ చాలీసా పారాయణం

యువత ఆధ్యాత్మికం వైపు అడుగులు వేస్తున్నారు. ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆలయాల్లో భక్తితో హనుమాన్​ చాలీసా పఠిస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, కమ్మర్​పల్లి: Hanuman Chalisa | ఇటీవల కాలంలో యువత భక్తిమార్గంలో పయణిస్తున్నారు. ముఖ్యంగా హనుమాన్ చాలీసా (Hanuman Chalisa) పారాయణం పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఆధ్యాత్మిక చింతన, మనశ్శాంతి, సానుకూల శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుందనే ఉద్దేశంతో యువత శ్రద్ధతో చాలీసా పఠనం చేస్తున్నారు.

Hanuman Chalisa | కమ్మర్​పల్లిలో..

మండల కేంద్రంలోని జంబి హనుమాన్ ఆలయం (Jambi Hanuman Temple), ఉప్లూర్​, ఏర్గట్లలో శనివారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. మూడేళ్లుగా ఆలయంలో ప్రతి వారం హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నట్లు భక్తులు పేర్కొన్నారు. కార్యక్రమంలో భక్తులు దుంతుల రమణయ్య, ఉట్నూరు రాజశేఖర్, భోగ రామస్వామి, రమేష్, నరేందర్, చింత ప్రవీణ్, శ్రీనివాస్,  భక్తులు పాల్గొన్నారు.

Must Read
Related News