ePaper
More
    HomeసినిమాHeroine Hansika | హీరోయిన్ విడాకుల రూమ‌ర్స్.. ఇన్‌స్టాలో పెళ్లి ఫొటోలు డిలీట్ చేయ‌డంతో వచ్చిన...

    Heroine Hansika | హీరోయిన్ విడాకుల రూమ‌ర్స్.. ఇన్‌స్టాలో పెళ్లి ఫొటోలు డిలీట్ చేయ‌డంతో వచ్చిన క్లారిటీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heroine Hansika | ఇటీవలి కాలంలో సినీ ప్రపంచంలో విభేదాలతో విడాకులు తీసుకుంటున్న జంటల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాకూడా వ్యక్తిగత కారణాలతో సంబంధాలు తెగిపోతున్న ఘటనలు మనం తరచూ చూస్తున్నాం. సమంత-నాగచైతన్య, నిహారిక-చైతన్య, ధనుష్-ఐశ్వర్య, అమీర్ ఖాన్ వంటి పలువురు ప్రముఖులు ఇప్పటికే తమ వివాహబంధానికి స్వ‌స్తి చెప్ప‌గా, ఇప్పుడు మరో ప్రముఖ నటి హన్సిక మొత్వానీ కూడా అదే దారిలో నడుస్తున్నారని గట్టిగా ప్రచారం సాగుతోంది. హన్సిక( Heroine Hansika) తన భర్త సోహైల్ కథూరియాతో విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయింద‌ని కొన్నాళ్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

    Heroine Hansika | ఫొటోల‌న్నీ డిలీట్..

    ఈ ప్ర‌చారాల న‌డుమ హన్సిక తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి పెళ్లి ఫొటోలను పూర్తిగా తొలిగించి వేసింది. ఈ చర్యను గమనించిన నెటిజన్లు, అభిమానులు వెంటనే వీరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని భావిస్తూ సోషల్ మీడియా(Social Media)లో చర్చకు తెరలేపారు. త్వ‌ర‌లోనే వారిరివురు విడాకులు తీసుకోవ‌డం ఖాయం అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, హన్సిక – సోహైల్ ప్రేమకథ చాలా ఇంట్రెస్టింగ్‌గా మొద‌లైంది. 2022 డిసెంబర్ 4న, రాజస్థాన్‌లోని జైపూర్ కోట(Jaipur Fort)లో వీరి వివాహం సింధీ సంప్రదాయాల ప్రకారం ఘనంగా జరిగింది. బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. అప్పట్లో వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఆ జ్ఞాపకాలన్నీ హన్సిక తన పేజ్ నుంచి తొలగించడమే కాకుండా, తన వ్యక్తిగత జీవితం విష‌యంలో నిశ్శబ్దం పాటించడం కూడా అనుమానాలకు తావిస్తోంది.

    READ ALSO  Kingdom Movie Review | కింగ్‌డ‌మ్ మూవీ రివ్యూ.. విజ‌య్ ఖాతాలో సాలిడ్ హిట్ ప‌డ్డ‌ట్టేనా?

    అయితే ఈ విడాకుల ప్ర‌చారం నేపథ్యంలో నిజమైన కారణాలు మాత్రం ఇంకా వెలుగులోకి రాలేదు. ఇద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలా? లేక వృత్తిపరమైన ఒత్తిడులా? అనే దానిపై స్పష్టత లేదు. హన్సిక కాని సోహైల్  కాని ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు. కానీ హన్సిక తీసుకుంటున్న కొన్ని నిర్ణ‌యాలు చూస్తే, ఈ వార్తలలో నిజం ఉండవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి, మరో సెలబ్రిటీ జంట విడిపోయే దిశగా వెళ్తోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. అభిమానులు మాత్రం ఈ జంట మళ్లీ ఒక్కటవాలని ఆశిస్తూ ఉన్నారు. త్వరలో హన్సిక లేదా సోహైల్ నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుందేమో చూడాలి.

    Latest articles

    Harish Rao | బీఆర్​ఎస్​పై ఆ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయి.. హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | కాంగ్రెస్​, బీజేపీ కలిసి బీఆర్​ఎస్​పై కుట్ర చేస్తున్నాయని మాజీ మంత్రి...

    Education Department | విద్యాశాఖ ఉద్యోగిపై వేటు

    అక్షరటుడే, ఇందూరు: Education Department | జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో వివాదాస్పదంగా మారిన జూనియర్ అసిస్టెంట్​పై ఉన్నతాధికారులు చర్యలు...

    PM Modi | చ‌ర్చ‌కు పట్టుబ‌ట్టి బొక్క బోర్లా ప‌డింది.. కాంగ్రెస్‌పై ప్ర‌ధాని మోదీ విసుర్లు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | ఆప‌రేష‌న్ సిందూర్‌పై పార్ల‌మెంట్‌లో చర్చకు ప‌ట్టుబ‌ట్టిన ప్రతిపక్షాలు బొక్క‌బోర్లా ప‌డ‌డంతో...

    Guvvala Balaraju | కేసీఆర్ వెళ్ల‌మంటేనే వెళ్లా.. ఎమ్మెల్యే కొనుగోలు అంశంపై గువ్వ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Guvvala Balaraju | తెలంగాణ‌తో పాటు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో...

    More like this