అక్షరటుడే, ధర్పల్లి : MP Arvind | బీఆర్ఎస్ (BRS) హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలతోనే ప్రాజెక్టులు, చెరువులు తెగిపోయి ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండంలంలోని ముత్యాల చెరువు తెగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన వాడి, నడిమితండా గ్రామాల్లో పర్యటించారు. వరద బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
MP Arvind | రూ.వేల కోట్లు దోచుకున్నారు
కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) పేరుతో కేసీఆర్ కుటుంబం రూ.వేల కోట్లు దోచుకుందని ఎంపీ ఆరోపించారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు అలసత్వం వహించిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా విచారణను సీబీఐకి అప్పగించడం హర్షణీయం అని పేర్కొన్నారు. ముత్యాల చెరువు తెగిపోయి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం అందించాలని డిమామడ్ చేశారు. కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేశ్, పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, జిర్ర మహిపాల్ యాదవ్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.