HomeUncategorizedPlane crash | గాలిలోనే బూడిదైన ఆ యువతి​ కలలు.. విమాన ప్రమాదంలో ఎయిర్​ హోస్టెస్​...

Plane crash | గాలిలోనే బూడిదైన ఆ యువతి​ కలలు.. విమాన ప్రమాదంలో ఎయిర్​ హోస్టెస్​ దుర్మరణం

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Plane crash : గుజరాత్​ Gujarat విమాన ప్రమాదం​ ఎందరో భవిష్యత్తు కలలను కల్లలు చేసింది. వారి ఉజ్వల జీవితాన్ని బూడిద చేసింది. అహ్మదాబాద్​ ఘోర ప్రమాదం ఒక్కొక్కరి జీవితాలను ఎలా ఛిన్నాభిన్నం చేసిందో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది.

అత్యంత వెనుకబడిన ప్రాంతమైన మణిపూర్‌(Manipur)లోని తౌబాల్ (Thoubal district) జిల్లా అవాంగ్ లీకేయ్‌కు చెందిన న్గంథోయ్ శర్మ కోంగ్‌బ్రైలత్‌పామ్(22)(Nganthoy Sharma Kongbrailatpam).. కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం సిబ్బందిలో ఒకరు. ఆమె ఏప్రిల్ 2023లో ఎయిర్ ఇండియా Air India లో చేరింది. అలా ఎయిర్ హోస్టెస్ air hostess కావాలనే తన కలను నెరవేర్చుకుంది.

ఈ రెండేళ్లలో ఆమె ఎన్నో దేశాలు తిరిగింది. తన కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచింది. తన జీవితంపై ఎన్నో కలలు కన్నది. తన కాళ్ల మీద తాను నిలబడ్డాక.. అవన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తోంది. ఈ రెండేళ్లలో తన పనితీరుతో, మాటతీరుతో అందరికీ సుపరిచుతురాలైంది.

తన భవిష్యత్తు అంతా సంతోషంగా ఉంటుందనుకుంటున్న తరుణంలో విధి వక్రించింది. విమాన ప్రమాదం రూపంలో ఆమెను మృత్యుఒడికి చేర్చింది. ఆమె కుటుంబంలో తీరని విషాదం నింపింది. కాగా, ఆమె ఫ్లైట్​లో విధులు నిర్వర్తించే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో, తన కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్​ మీడియాలో నెటిజన్లను కంట తడి పెట్టిస్తున్నాయి.