అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pakistan Cricketer | ఇటీవల క్రికెటర్స్ లేని పోని వివాదాలలో చిక్కుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని రోజుల క్రితం యష్ దయాల్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా పాకిస్తాన్ క్రికెటర్ (Pakistani Cricketer) హైదర్ అలీపై లైంగిక దాడి ఆరోపణలు రావడంతో అందరూ అవాక్కయ్యారు.
ఈ సంఘటన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board) అతన్ని వెంటనే సస్పెండ్ చేయగా, వెంటనే మాంచెస్టర్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ పోలీసులు (Manchester Police) హైదర్‌ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై విడుదలైనప్పటికీ, పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకొని, ఆయనపై ప్రయాణ ఆంక్షలు విధించారు. ఈ ఘటనపై అధికారిక విచారణ కొనసాగుతోంది.
Pakistan Cricketer | పెద్ద రిస్కే..
హైదర్ అలీ (Hyder Ali) దోషిగా తేలితే ఎలాంటి శిక్షలు పడవచ్చు అంటే.. ఇంగ్లండ్‌లో (England) లైంగిక దాడికి సంబంధించిన చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఇక్కడ లైంగిక సంబంధాలకు చట్టపరమైన వయస్సు 16 ఏళ్లు. 16 ఏళ్లలోపు వ్యక్తితో లైంగిక సంబంధం ఆమె సమ్మతితో జరిగినా కూడా అది చట్టవిరుద్ధం. లైంగిక దాడి కేసు రకం ఆధారంగా శిక్ష మారుతుంది. రేప్, సెక్సువల్ అసాల్ట్, కోర్షన్ తదితర విభాగాల్లో చట్టాలు విభజించబడ్డాయి. ఈ తరహా నేరాల్లో కనీస శిక్ష 4 ఏళ్లు, గరిష్ఠ శిక్ష జీవిత ఖైదు కూడా కావచ్చు.
అయితే జీవిత ఖైదు అంటే తప్పనిసరిగా జీవితాంతం జైలులో ఉండాలని కాదు. సాధారణంగా 15-19 ఏళ్ల శిక్ష విధించి, ఆ తర్వాత పారోల్ ఇవ్వడం జరుగుతుంది. కేసులో స్పష్టత అవసరం. ప్రస్తుతం కేసులో కొన్ని కీలక విషయాలు ఇంకా వెలుగులోకి రాలేదు. ఆమె హైదర్ అలీతో ముందుగా పరిచయం ఉన్నవ్యక్తా, శారీరక దాడి జరిగినదా లేక బెదిరింపులతో లైంగిక చర్యలకు పాల్పడ్డాడా? ఈ వివరాల ఆధారంగా హైదర్‌పై కేసు తీవ్రత నిర్ధారితమవుతుంది.
2020లో పాకిస్తాన్ తరపున అరంగేట్రం చేసిన హైదర్ అలీ.. 35 టీ 20ల్లో 505 పరుగులు, 2 వన్డేల్లో 42 పరుగులు చేశాడు. అతను 2023 అక్టోబర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే పీసీబీ అతనిపై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. ఈ ఆరోపణలు నిజమా కాదా అన్నది ప్రస్తుతం విచారణలో ఉంది. ఒకవేళ హైదర్ అలీపై ఆరోపణలు రుజువైతే, అతనికి కఠిన శిక్షలు తప్పకపోవచ్చు.
