HomeUncategorizedPakistani Spy | పంజాబ్‌లో పాకిస్తాన్‌కు గూఢ‌చ‌ర్యం చేసే వ్య‌క్తి అరెస్ట్.. ల‌ష్కరే తోయిబా చీఫ్‌తో...

Pakistani Spy | పంజాబ్‌లో పాకిస్తాన్‌కు గూఢ‌చ‌ర్యం చేసే వ్య‌క్తి అరెస్ట్.. ల‌ష్కరే తోయిబా చీఫ్‌తో పిక్స్ వైర‌ల్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Pakistani Spy | దేశ సైనిక రహస్యాలను పాకిస్థాన్‌(Pkistan)కు చేరవేస్తున్న గూఢ‌చ‌ర్య నెట్‌వ‌ర్క్‌ను పోలీసులు చేధిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) సమయంలో పాకిస్థాన్‌కు స‌మాచారం ఇచ్చిన వారిని వెతికి ప‌ట్టుకుంటున్నారు. రీసెంట్‌గా దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో భారీ సోదాలు NIA Conducts Raids నిర్వహించింది. ఈ సోదాలు మే 31, శనివారం రోజున ఢిల్లీ, మహారాష్ట్ర (ముంబై), హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, పశ్చిమ బెంగాల్‌లలో జరిగాయి. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లతో (PIO) సంబంధాలు ఉన్న అనుమానితుల ఇళ్లలో ఈ సోదాలు చేపట్టారు. ఈ సోదాల సమయంలో ఎన్‌ఐఏ(NIA) బృందాలు అనేక ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, సున్నితమైన ఆర్థిక పత్రాలు, ఇతర నేర సంబంధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి.

అయితే పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో ISI సంబంధాలున్న వ్యక్తిని తాజాగా పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. భారత సైనికుల(Indian soldiers) కదలికలకు సంబంధించిన కీలక సమాచారాన్ని అతడు ఏళ్లుగా సరిహద్దు ఆవల ఉన్న ఏజెంట్లకు చేరవేస్తున్నాడని, అందులో ‘ఆపరేషన్ సిందూర్’కు సంబంధించిన సున్నితమైన వివరాలు కూడా ఉన్నట్టు పంజాబ్ పోలీస్ చీఫ్(Punjab Police Chief) తెలిపారు. భారత సైన్యానికి చెందిన ముఖ్యమైన కార్యకలాపాలు, వ్యూహాలు, సైనికుల కదలికల వంటి కీలక సమాచారాన్ని నిందితుడు ఎప్ప‌టిక‌ప్పుడు పాకిస్తాన్ ఏజెంట్ల‌(Pakistani agents)కి చేర‌వేస్తున్నాడ‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో కూడా కీలకమైన సమాచారాన్ని శత్రుదేశానికి అందించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.

నిందితుడికి అంతర్జాతీయ ఉగ్రవాది, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌(Lashkar-e-Taiba chief Hafiz Saeed)తో కూడా సంబంధాలున్నట్టు పోలీసులు గుర్తించారు. హఫీజ్ సయీద్‌తో నిందితుడు దిగిన ఫోటోలు కూడా లభ్యమైనట్టు తెలుస్తోంది. హఫీజ్ సయీద్ భారత్‌(India)లో జరిగిన అనేక ఉగ్రదాడులకు సూత్రధారి కాగా, తాజాగా అరెస్ట్ అయిన వ్యక్తి ద్వారా మరిన్ని కీలక వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నిందితుడిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. అతని నెట్‌వర్క్ ఎంతవరకు విస్తరించి ఉంది, ఇంకా ఎవరెవరు ఇందులో భాగస్వాములు అనే కోణంలో ద‌ర్యాప్తు క్షుణ్ణంగా జ‌రుపుతున్నారు.